Begin typing your search above and press return to search.

బాలీవుడ్ వైపు చూడని రాజమౌళి... ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 9:00 AM IST
బాలీవుడ్ వైపు చూడని రాజమౌళి... ?
X
రాజమౌళి దర్శక ధీరుడు. అపజయం ఎరుగని వీరుడు. ఆయన చేసినవి గట్టిగా పదిహేను సినిమాలు కూడా ఉండవు. అయితేనేమి. ఆయన దేశం గర్వించతగిన దర్శకుడుగా ఉన్నారు. చిన్న వయసులోనే పద్మశ్రీ అవార్డీ అయ్యారు. ఇక ఆయన తెలుగు కీర్తిని ఖండాతరాలకు వ్యాప్తి చెందేలా చేశారు.

ఆయన లాటెస్ట్ క్రియేషన్ ట్రిపుల్ ఆర్ జనవరి 7న విడుదల కాబోతోంది. ఇపుడు ఆ ప్రమోషన్ లో రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉండగానే రాజమౌళి తరువాత చేయబోయే సినిమా ఏంటి అన్న చర్చ కూడా వస్తోంది. అయితే దానికి రాజమౌళి జవాబు చెప్పారు కూడా. మీడియా ముందు మహేష్ బాబు తో తరువాత మూవీ ఉంటుంది అని ఆయన పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు.

ఇక ఆ తరువాత లిస్ట్ లో కూడా మరో హీరో ఉన్నాడు. ఆయనే అల్లు వారి అబ్బాయి అర్జున్. అర్జున్ తో రాజమౌళి మూవీ మహేష్ సినిమా తరువాత ఉంటుందని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలు అయ్యేసరికి కచ్చితంగా మరో రెండు మూడేళ్ల కాలం పడుతుంది. ఆ తరువాత చేస్తే ప్రభాస్ తోనే మరో సినిమా అంటున్నారు. అంటే సమీప భవిష్యత్తులో రాజమౌళి బాలీవుడ్ కి వెళ్ళరని అర్ధమైపోతోంది.

నిజానికి బాహుబలితోనే రాజమౌళికి బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసేసింది. ఆయన తలచుకోవాలే కానీ అక్కడ టాప్ లెవెల్ హీరోలతో మూవీస్ చేయవచ్చు. కానీ ఎందుకో రాజమౌళి టాలీవుడ్ హీరోలతోనే సినిమాలు వరసబెట్టి చేస్తున్నారు. ఆయన బాలీవుడ్ హీరోలతో మూవీ చేసి దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయవచ్చు. కానీ అలా జరగడంలేదు.

తెలుగు వాతావరణానికే పూర్తిగా ఆయన ఆధారపడి ఇలా చేస్తున్నారా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి జక్కన్న తెలుగు గడప దాటకుండానే తన సత్తా జాతీయ స్థాయిలో చాటుకోవడం విశేషంగానే చూడాలి. ఇదిలా ఉంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఆ మూవీని చేసే సమయంలో కచ్చితంగా బాలీవుడ్ హీరోలను మరింతమందిని చేర్చుకుంటారని అంటున్నారు. మొత్తానికి మెయిన్ హీరో మాత్రం జక్కన్నకు తెలుగు వారే ఉండాలన్నది రూల్ గా ఉన్నట్లుంది.