Begin typing your search above and press return to search.

కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పేసిన జక్కన్న

By:  Tupaki Desk   |   9 Sep 2015 7:30 AM GMT
కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పేసిన జక్కన్న
X
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్. మన తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సినీ ప్రేక్షకుల్ని ఈ ప్రశ్న వేధిస్తోంది. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పేశాడు. ఐతే ఆయన జవాబు చెప్పింది కామన్ ఆడియన్స్ కి కాదు. తన యూనిట్ సభ్యులకి. నెల రోజులుగా బాహుబలి-2 స్క్రిప్టుకు మెరుగులు దిద్దిన జక్కన్న ఎప్పట్లాగే తన టెక్నికల్ టీమ్ తో సిట్టింగ్ వేసి.. వాళ్లకు కథను నరేట్ చేశాడు. కథారచయిత విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎస్.కార్తికేయ, తమిళ రచయిత మదన్ కార్కితో పాటు బాహుబలి టెక్నికల్ టీమ్ అంతా ఈ సిట్టింగ్ లో పాల్గొంది.

రాజమౌళి డైరెక్టర్ సీట్ లో కూర్చుని అందరికీ కథ నరేట్ చేస్తున్న దృశ్యాన్ని నిర్మాత శోభు ట్విట్టర్లో పెట్టాడు. రాజమౌళి బాహుబలి తొలి భాగం తీసేటపుడు కూడా ఇలాగే తన యూనిట్ సభ్యులందరికీ కథ నరేట్ చేశాడు. అందరితో రిహార్సల్స్ చేయించాడు. ఐతే ముందుగా టెక్నికల్ టీమ్ కు నరేషన్ అయిపోయింది. ఆ తర్వాత నటీనటలకు వేరే సెషన్ ఉంటుంది. బాహుబలి-2 కథ కూడా ఇంతకుముందే రెడీ అయింది, 40 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. ఐతే తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూశాక.. రెండో భాగంపై భారీ అంచనాల్ని అందుకునేందుకు మరింతగా కష్టపడింది రాజమౌళి బృందం. దాదాపు నెల రోజుల నుంచి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తో పాటు వీరి కుటుంబ సభ్యులు, అసిస్టెంట్లు కూర్చుని మరింత పకడ్బందీగా స్క్రిప్టు తయారు చేశారు.