Begin typing your search above and press return to search.

అల్లూరిగా చరణ్ ఎంట్రీ మామూలుగా ఉండదట!

By:  Tupaki Desk   |   27 Dec 2021 9:44 AM IST
అల్లూరిగా చరణ్ ఎంట్రీ మామూలుగా ఉండదట!
X
సాధారణంగా ఏ సినిమాలో హీరో ఎవరనేది తెలిసే అందరూ సినిమాకి వెళుతుంటారు. అయినా హీరో ఎవరనేది అప్పుడే రివీల్ చేస్తున్నట్టుగా కొన్ని బిల్డప్ షాట్స్ తో ఆ పాత్ర ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటూ ఉంటాయి. హీరోయిజాన్ని ఒక రేంజ్ లో ఆవిష్కరించే ప్రయత్నం దాదాపు ఇంట్రడక్షన్ సీన్ తోనే జరిగిపోతుంది. ఆ స్థాయి ఇంట్రడక్షన్ లేకపోతే అభిమానులు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అందువలన హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ ను డిజైన్ చేయడంలో దర్శకులు ప్రత్యేకమైన దృష్టి పెడుతుంటారు .. శ్రద్ధ చూపుతుంటారు.

అలాంటిది రాజమౌళి సినిమా అంటే ఇక హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పేదేముంటుంది? అందువల్లనే ఇప్పుడు అటు నందమూరి అభిమానులు ... ఇటు చరణ్ ఫ్యాన్స్ 'ఆర్ ఆర్ ఆర్' లో తమ హీరో ఇంట్రడక్షన్ ఏ రేంజ్ లో ఉండనుందనే ఆసక్తిని కనబరుస్తున్నారు.

అసలే ఈ రెండు పాత్రలు చాలా పవర్ఫుల్. ఎన్టీఆర్ - చరణ్ క్రేజ్ కి తగినట్టుగా, ఆ పాత్రల రేంజ్ కి తగినట్టుగా ఇంట్రడక్షన్ ఉండాలి. అది ఎలా ఉండనుందనే విషయాన్ని గురించే అభిమానులు మాట్లాడుకుంటున్నారు. తెరపైకి ఎన్టీఆర్ .. చరణ్ ఎలా రానున్నారనే విషయాన్ని గురించే చర్చించుకుంటున్నారు.

ఇక తాజా ఇంటర్వ్యూలో రాజామౌళి మాట్లాడుతూ, చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ప్రస్తావించారు. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్టుల కాంబినేషన్లో చరణ్ ఇంట్రో సీన్ ను చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఆ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు.

ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు తానే చాలా ఎగ్జైట్ అయ్యాననీ, ఈ సీన్ కి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదని అన్నారు. సినిమాలో ఒక సన్నివేశాన్ని మించి మరొక సన్నివేశం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఈ సీన్ కి మంచి అప్లాజ్ వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

రాజమౌళి మాటలు విన్న తరువాత మెగా అభిమానులలో మరింత ఉత్కంఠ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సీన్ లో చరణ్ పెర్ఫార్మెన్స్ చూడటానికి వాళ్లంతా ఉబలాటపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా ఏ మాత్రం తగ్గదని ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన అభిమానుల అంచనాలకి మించి ఆయన ఇంట్రో ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా చూసిన తరువాత తూకం వేసినట్టుగా ఈ రెండు పాత్రలను రాజమౌళి మలిచారని ప్రతి ఒక్కరూ అనుకోవడం ఖాయమని తెలుస్తోంది. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం అందరూ ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.