Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్'లో ఆ ఎమోష‌నల్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవనుందట..!

By:  Tupaki Desk   |   7 Nov 2020 5:05 PM GMT
ఆర్.ఆర్.ఆర్లో ఆ ఎమోష‌నల్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవనుందట..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్‌.ఆర్‌.ఆర్‌''. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్‌ పాత్రలను తీసుకొని ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రామరాజు - భీమ్ ఇంట్రో వీడియోలు ఈ సినిమాపై మరింత హైప్ ని తీసుకొచ్చాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జక్కన్న ఈ సినిమాలో 1919లో జరిగిన 'జలియన్ వాలా భాగ్' ఉందంతాన్ని చిత్రీకరించడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారట. ఇది ఫిక్షనల్ స్టోరీ కావడంతో ఇంకాస్త ఫ్రీడమ్ తీసుకొని సినిమాలో భాగమయ్యేలా చేస్తున్నారని సమాచారం.

కాగా, భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు 1919 ఏప్రిల్ 13 వైశాఖీ పండుగ రోజున అమృత్ సర్ జలియన్ వాలాబాగ్ లో సభ నిర్వహిస్తున్న సమయంలో బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాలతో కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో 1000 నుంచి 1500 మంది వరకు ఇండియన్స్ చనిపోయారని చరిత్రకారులు చెప్పారు. ఇండియ‌న్ హిస్ట‌రీలో ఓ బ్లాక్ మార్క్ గా మాదిరిగా క‌నిపించే ఈ ఘ‌ట‌నను జక్కన్న వెండితెరపై రీ క్రియేట్ చేయనున్నాడట. జ‌లియ‌న్ వాలా భాగ్ ఇన్సిడెంట్ ని ఎమోష‌నల్ గా హై స్టాండ‌ర్డ్స్ లో తెర‌కెక్కించ‌డానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవ్వ‌నుంద‌ట. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.