Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్' ట్రయిల్ షూట్ పైనే ఇండస్ట్రీ ఆధారపడి ఉందా..?

By:  Tupaki Desk   |   15 Jun 2020 8:00 PM IST
ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ పైనే ఇండస్ట్రీ ఆధారపడి ఉందా..?
X
దేశంలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా పైగా షూటింగులు అన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వాలు షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి తెలంగాణలో షూటింగులు మొదలవ్వాల్సి ఉంది. మొత్తానికి షూటింగ్ కోసం అనుమతులు అయితే వెంటాడి వేటాడి తెచ్చుకున్నా.. ఇప్పట్లో షూటింగులు మొదలు పెట్టడానికి నిర్మాతలు మాత్రం సిద్దంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ నిబంధనలు అధికంగా ఉండటమే దీనికి కారణమని అంటున్నారు. పోనీ అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే రెండింతలు కష్టపడాలని.. ఖర్చు కూడా డబుల్ అవుతుందని నిర్మాతలు చెప్తున్నారు. కానీ టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఒక ట్రయిల్ షూట్ చేస్తున్నారని.. తక్కువ సిబ్బందితో ఆర్ఆర్ఆర్ షూట్ ప్లాన్ చేసి రెండు వందల మందికి పైగా చేయాల్సిన షూట్ యాభై మందితో చేస్తారని ప్రచారం జరిగింది.

నిజానికి శుక్రవారం రోజే షూటింగ్ జరగనుందని అంతా అనుకున్నారు. షూట్ అప్పుడు జరుగుతుందని కూడా సమాచారం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఈరోజు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ ట్రయిల్ షూట్ నిర్వహించనున్నట్టు సమాచారం. రాజమౌళి చేసే ఈ ట్రయిల్ షూట్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఆయన షూట్ చేసుకోవచ్చని సర్టిఫై చేస్తే మిగతావాళ్ళు కూడా షూటింగులు మొదలు పెట్టాలని భావిస్తున్నారట. అయితే ట్రయిల్ షూట్ లో డూప్ లను పెట్టి షూట్ చేస్తారని అంటున్నారు.. డూప్ లతో సక్సెస్ అయితే హీరోలతో షూటింగ్ ప్రారంభం చేయాలనీ రాజమౌళి ప్లాన్ వేసాడట. చూడాలి మరి రాజమౌళి టీమ్ ఎలాంటి ఖబర్ అందించనుందో..!