Begin typing your search above and press return to search.

సడెన్‌గా కళ్లు దుకాణంలో దర్శనమిచ్చాడు

By:  Tupaki Desk   |   10 July 2015 4:38 PM GMT
సడెన్‌గా కళ్లు దుకాణంలో దర్శనమిచ్చాడు
X
బాహుబలి బోలెడంత డిష్కసన్‌కి స్కోపిచ్చింది. ఈ సినిమా గురించి పుంఖాను పుంఖాలుగా రాసుకునే చాన్సు కూడా ఉంది. ఇప్పటికే బోలెడన్ని టాపిక్‌లు కవరైపోయాయి కానీ డైరెక్టర్‌ రాజమౌళి ఇచ్చిన ఓ షాక్‌ గురించి ఎవరూ చర్చించనేలేదు. సినిమా కథ పరంగా సీరియస్‌ మోడ్‌లోకి వెళుతున్న టైమ్‌లో చూస్తున్న ప్రేక్షకులకు సడెన్‌ ట్విస్ట్‌. ఉన్నట్టుండి జక్కన్న కల్లు కాంపౌండ్‌లో దర్శనమిస్తాడు. అక్కడ బోలెడంత కామెడీ.

'మత్తు' ఉందా? అని బాహుబలి అడిగితే ఒక్కో కల్లు కుండ ముందు పెడుతుంటాడు రాజమౌళి. అయితే ఇంకా పెద్దది అంటూ కుండలన్నీ చిదక్కొట్టేస్తుంటాడు ప్రభాస్‌. అప్పుడు రాజమౌళికి ఒకే డైలాగ్‌. ముందు డబ్బుందా? అని అడుగుతాడు. జక్కన్న కనిపించిన ఆ బిట్‌ చూసి జనాలు ఒకటే విజిల్స్‌. రాజమౌళి ఇప్పటివరకూ బోలెడన్ని సినిమాలు తీసినా ఎక్కడా తెరపై కనిపించే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో నితిన్‌ హీరోగా తెరకెక్కించిన 'సై' చిత్రంలో ఓ బిట్‌లో కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ ఇదే. సడెన్‌గా కళ్లు దుకాణంలో కనిపించి షాకిచ్చాడు. కాని ఓ విషయం చెప్పుకోవాలి.. మనోడు డైలాగ్‌ లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇరగదీశాడులే.