Begin typing your search above and press return to search.

తన పక్కనున్నది కొడుకే అయినా చిరంజీవిగారు లెక్కచేయరు!

By:  Tupaki Desk   |   24 April 2022 11:00 AM IST
తన పక్కనున్నది కొడుకే అయినా చిరంజీవిగారు లెక్కచేయరు!
X
కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ .. 'ఆచార్య'లో చిరంజీవిగారినీ .. చరణ్ ను తిరు చాలా అద్భుతంగా చూపించారు. ఇక 'ధర్మస్థలి' సెట్ గురించి ఇండస్ట్రీలోని వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళదామనుకుంటే కుదరలేదు. ఇప్పటికీ ఆ సెట్ అలాగే ఉంది గనుక ఒకసారి వెళ్లి చూసొస్తాను.

మణిశర్మగారి సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. 'లాహే లాహే'గానీ .. 'భలే బంజారా' పాటలను ఎన్నిసార్లు ప్లే చేసినా, మళ్లీ ప్లే చేస్తే బాగుండునని అనిపిస్తోంది. చిరంజీవి .. మణిశర్మ గార్ల కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో మనకి తెలుసు. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. చరణ్ గురించి మూడు నెలలుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ మాత్రం ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. 'మగధీర' సమయంలో చిరంజీవిగారు కథ విన్నారు. చరణ్ విషయాలన్నీ చిరంజీవిగారు దగ్గరుండి చూసుకుంటారేమోనని అనుకున్నాను.

కాస్త ఆలస్యంగా నాకు అర్థమైన విషయం ఏమిటంటే, చిరంజీవిగారు చరణ్ కి ఎలాంటి సలహాలు ఇవ్వరు. ఇలా చేయి .. అలా చేయి అని చెప్పరు. చరణ్ తనకి తానుగా నేర్చుకున్నాడు .. తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ తనకి తానుగా ఎదిగాడు. చరణ్ తన హార్డ్ వర్క్ ద్వారానే ఎదగడం జరిగింది. చిరంజీవి అంత ఎదుగుతాడని మనం చెప్పలేం గానీ, ఆయన దగ్గరలోకి తప్పకుండా వెళతాడని భావిస్తున్నాను.

చిరంజీవిగారిలో నాకు నచ్చే విషయమేమిటంటే పోటీపడే తత్వం. స్క్రీన్ లో పక్కన ఉన్నది తన కొడుకే అయినా, ఆయనను డామినేట్ చేయాలని చూస్తుంటారు. ఆయనలోని ఆ లక్షణం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఒక అభిమానిగా చిరంజీవిగారే బాగున్నారనిపిస్తుంది గానీ, ఒక డైరెక్టర్ గా నా హీరో నాకు బాగా అనిపిస్తాడు. కొరటాల శివగారి విషయానికి వస్తే చాలా సైలెంట్ గా ఉంటారు .. ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. ఈ పాండమిక్ లో చాలా సార్లు కలుకుని మాట్లాడుకున్నాము. ఆ సమయంలో ఆయన గురించిన చాలా విషయాలు తెలిశాయి. ఆయన చాలా కూల్ గా కనిపిస్తారుగానీ, ఆయన మనసులోని మాస్ ఎలిమెంట్స్ మరెక్కడా కనిపించవు" అని చెప్పుకొచ్చారు.