Begin typing your search above and press return to search.
RRR ట్రైలర్ కోసం జక్కన్న భారీ ప్లాన్స్..!
By: Tupaki Desk | 9 Dec 2021 9:03 AM ISTఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలసి చేస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్లు - పాటలు విశేష స్పందన తెచ్చుకోగా.. రేపు గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.
RRR ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో.. సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో చరణ్ ను నిప్పుతో పోల్చుతూ.. తారక్ ను నీటికి ప్రతీకగా చూపించారు. ఇద్దరు కలిసి ఉన్న ఈ ఇంటెన్స్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ముందుగా హైదరాబాద్ - చెన్నై - బెంగుళూరు - ముంబై వంటి పలు ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మల్టీ సిటీ ట్రైలర్ లాంచ్ ప్లాన్ డ్రాప్ చేసుకొని.. డైరెక్ట్ థియేటర్లలో అవిష్కరిస్తున్నారు. అయితే రేపు ముంబైలో స్పెషల్ గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
RRR చిత్రాన్ని పప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రేపు తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారు. కాకపోతే ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో పైరసీ రూపంలో అందరూ ముందే చూసే అవకాశం ఉంది. థియేటర్స్ లోకి మొబైల్స్ తీసుకెళ్లకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.
ఏదేమైనా RRR ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు, హైప్ రెట్టింపు అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇది కచ్చితంగా జక్కన్న తరహా యాక్షన్ - స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడి ఉంటుందని ఊహిస్తున్నారు. ఎప్పటిలాగే కీరవాణి బీజీఎం కూడా స్పెషల్ గా ఉండబోతోందని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు ఈక్వల్ స్క్రీన్ స్పేస్ - తగిన ప్రాధాన్యత ఉండేలా దర్శకధీరుడు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ లను ముందెన్నడూ చూడని అవతారాల్లో చూసేందుకు యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న RRR ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ - లైకా - పీహెచ్ఎఫ్ - కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.