Begin typing your search above and press return to search.

పిక్ టాక్: కత్తి దూసిన రాజమౌళి

By:  Tupaki Desk   |   20 Nov 2015 10:13 AM IST
పిక్ టాక్: కత్తి దూసిన రాజమౌళి
X
తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో తన వంతు పాత్ర పోషిస్తున్న రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ ఏ కాదు. మంచి మాటకారి కూడా. ఇతర సినిమా ఆడియో ఫంక్షన్ లలో ఆ చిత్ర డైరెక్టర్ లను తనదైన శైలిలో పొగుడుతూ మెప్పించడమే దీనికి ఉదాహరణ. నిజానికి తెలుగు పెద్ద డైరెక్టర్ లలో రామ్ గోపాల్ వర్మ తరువాత అంతగా ట్విట్టర్ లో యాక్టీవ్ గా వుండేది జక్కన్న మాత్రమే.

అయితే రాజమౌళి నిన్నసోషల్ మీడియా లో సరదాగా ఒక ఫోటో షేర్ చేశాడు. తన ఆస్థాన కెమెరా మెన్ సెంథిల్ తో కత్తి పోరాటంలో పాల్గున్న ఒక ఫోటోని పెట్టడం విశేషమైతే దానికి తను పెట్టిన కామెంట్ అతని హ్యుమర్ కి ప్రతీక. నాకూ మా సినిమాటోగ్రాఫర్ కి మధ్య క్రియేటివ్ విభేదాలను ఇలానే పరిష్కరించుకుంటామని తెలుపడం విశేషం. ఎటువంటి సన్నివేశాన్నైనా నటీనటులకు ముందే కళ్ళకు కట్టినట్టు చూపించడం రాజమౌళి స్పెషాలిటీ. ఆ భాగంలో తీసిన ఫోటోని మీరూ ఓ లుక్కేయండి.