Begin typing your search above and press return to search.
జక్కన్న మాట: నా ఫేవరెట్ సీన్ అదే..
By: Tupaki Desk | 31 March 2016 5:00 PM ISTరమ్యకృష్ణ పసివాడైన బాహుబలిని నీళ్లలోంచి పైకెత్తుకునే సన్నివేశమే ‘బాహుబలి’ సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన సన్నివేశం అని చెప్పాడు రాజమౌళి. ‘బాహుబలి’కి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో కరణ్ జోహార్ ‘ధర్మ ప్రొడక్సన్స్’ రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియోలో రాజమౌళి ‘బాహుబలి’కి సంబంధించి మరికొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.
బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా అత్యంత కష్టపడ్డ సన్నివేశం ఏది అని అడగ్గా.. ‘‘ప్రభాస్ తమన్నాను అందుకోవడానికి నీళ్లల్లోకి దూకే సన్నివేశానికి చాలా కష్టపడ్డాం. ప్రభాస్ భుజానికి సర్జరీ చేయించుకున్నాక తీసిన సన్నివేశం అది. అందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రభాస్ కు ఏమవుతుందో అన్న భయం మధ్య ఆ షాట్ తీశాం. చాలా కష్టపడి.. చాలా సమయం తీసుకుని ఆ సన్నివేశం చేశాం’’ అని రాజమౌళి తెలిపాడు. బాహుబలి షూటింగుకి సంబంధించి మరిచిపోలేని మూమెంట్ ఏది అని అడగ్గా.. ‘‘ప్రతి మూమెంట్ మధుర జ్నాపకమే. ఏదో ఒకటి చెప్పలేను’’ అన్నాడు. బాహుబలి యూనిట్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరని అడగ్గా.. ‘‘ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డే నా ఫేవరెట్. ఆయన ఈ సినిమాకు ఎంత కష్టపడ్డారో చెప్పలేను. నా కోడైరెక్టర్ ఆయనే. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అతనే’’ అన్నాడు.
బాహుబలి షూటింగ్ లో ఎక్కువ తమాషా చేసిన వ్యక్తి రానానే అన్న రాజమౌళి.. సెట్ కు కరెక్ట్ టైంకు వచ్చేవాళ్లలో లైన్ ప్రొడ్యూసర్ శ్రీ వల్లి ముందుంటారని.. అన్ని వేలమందితో సజావుగా షూటింగ్ చేయగలిగామంటే ఆమే కారణమని చెప్పాడు. సినిమాలో చాలా త్వరగా డైలాగ్ నేర్చుకుని.. పక్కాగా చెప్పేవాళ్లు ఎవరు అంటే రమ్యకృష్ణ..నాజర్ ల పేర్లు చెప్పాడు రాజమౌళి.