Begin typing your search above and press return to search.

కొత్త దర్శకుడితో జక్కన్న ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   28 Aug 2017 8:36 AM GMT
కొత్త దర్శకుడితో జక్కన్న ఫ్యామిలీ
X
రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే చాలు ఆయనతో కలిసిపనిచేసే వారు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుటుంబమంతా సపరివార సమేతంగా వచ్చి జక్కన్న సినిమా షూటింగ్ లలో ఏ స్థాయిలో కలిసి పనిచేస్తారో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అదే స్థాయిలో రాజమౌళి సతీమణి మరియు ఆయన కుమారుడు మరోక కొత్త దర్శకుడి సినిమాకు పని చేస్తున్నారు.

నిర్మాత సాయి కొర్రపాటికి రాజమౌళి ఫ్యామిలితో తో చాలా దగ్గరి సంబంధం ఉండడంతో రమ గారిని మరియు కార్తికేయని యుద్ధ శరణం సినిమా యూనిట్ లో భాగస్వామిగా చేశారు. బాహుబలికి అసిస్టెంట్ డైరక్టర్ గా చేశాక.. కార్తికేయ ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తుండగా.. రమా రాజమౌళి మాత్రం కాస్ట్యూమ్స్ కు సంబంధించిన సలహాలు సూచనలూ ఇచ్చారట. అలాగే కీరవాణి కూడా కాలభైరవ ఈ సినిమాలో పాటలు కూడా పాడేశాడు. మొత్తానికి మరోసారి రాజమౌళి కుటుంబం అంతా కలసి ఇలా ఇంకో సినిమాకు పనిచేసిందనమాట. మరి రాజమౌళి ఈ సినిమాకు ఏం చేశాడో తెలుసా?

నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో వేడుక గత రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి పబ్లిసిస్ట్ అవతారం ఎత్తేశాడు. ఈ వేడుకలో రాజమౌళి - రమ ని చాలా పొగిడారు. కొత్త దర్శకుడైన కృష్ణ టేస్ట్ కి తగ్గట్టుగా చాలా చక్కగా పనిచేశారని మెచ్చుకున్నాడు. అలాగే సినిమా యూనిట్ కూడా చాలా చక్కగా వర్క్ చేశారని పొగుడుతూ..చైతూకి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. అందుకేనేమో సాయి కొర్రపాటి బ్యానర్ లో రాజమౌళికి సీక్రెట్ ఇన్వెస్ట్ మెంట్ ఉందంటారు!!