Begin typing your search above and press return to search.

బాహుబలి కోసం మూడు తరాల తాపత్రయం

By:  Tupaki Desk   |   9 May 2017 4:33 AM GMT
బాహుబలి కోసం మూడు తరాల తాపత్రయం
X
బాహుబలి.. ఇప్పుడీ పేరే ఒక బ్రాండ్. ఒక టాలీవుడ్ మూవీ అనే బ్రాండ్ నుంచి బైటకు వెళ్లిపోయి.. భారతదేశం గర్వించదగ్గ సినిమా అనిపించేసుకుంది. ఇండియన్ ఫిలిం సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. రెండో వీకెండ్ నాటికే 1000 కోట్ల రూపాయల గ్రాస్ బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ కూడా సృష్టించేసింది. ఈ మూవీని ఈ స్థాయికి చేర్చడంలో.. ఒకే కుటుంబానికి చెందిన మూడేసి తరాల చొప్పున కష్టపడ్డారని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.

శివ దత్త- కీరవాణి - కాల భైరవ.. సింహ కోడూరి

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈయన తండ్రి శివదత్త పాటలు రాశారు. కీరవాణి కొడుకులు అయిన కాల భైరవ దండాలయ్యా పాట పాడడం విశేషం. బాహుబలి వర్చువల్ రియాలిటీ ఫిలింలో సింహ కోడూరి హీరోగా నటిస్తున్నాడు.

విజయేంద్ర ప్రసాద్- రాజమౌళి- కార్తికేయ

బాహుబలి సిరీస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అని చెప్పాల్సిన పని లేదు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి. ఈయన కొడుకు కార్తికేయ సెకండ్ యూనిట్ కు దర్శకత్వం వహించడంతో పాటు.. షోయింగ్ బిజినెస్ కంపెనీ ద్వారా ప్రచార కార్యక్రమాలను చూసుకున్నాడు.

కోడూరి రామకృష్ణ- రాజా కోడూరి

కన్నా నిదురించరా.. భళి భళి పాటలను శివదత్త- కోడూరి రామకృష్ణ కలిసి రాశారు. రాడాన్ ద్వారా సాంకేతిక కార్యక్రమాల్లో రాజా కోడూరి పాల్గొన్నాడు.

శివదత్త- కళ్యాణ రమణ- మయూర్

మ్యూజిక్ సూపర్ వైజింగ్ కార్యక్రమాలను కళ్యాణ రమణ చూసుకున్నాడు. బాహుబలి2 చివరలో వాయిస్ ఇచ్చాడు మయూర్.

వీరితో పాటు రాజమౌళి భార్య రమా రాజమౌళి.. కీరవాణి భార్య శ్రీవల్లి బాహుబలి కోసం ఎంతగా తపన పడ్డారో చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద ఈ కుటుంబంలో మూడు తరాలు ఒకే సినిమా కోసం విపరీతంగా కష్టపడి.. తమ ఫ్యామిలీ ప్రొడక్ట్ ను ప్రపంచం మెచ్చేలే చేయగలిగారు.