Begin typing your search above and press return to search.
కర్ణాటకలోని పురాతన ఆలయంలో పూజలు చేసిన రాజమౌళి దంపతులు...!
By: Tupaki Desk | 17 Sept 2020 9:30 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకేంద్రుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆరు నెలల తర్వాత తన సతీమణి రమా రాజమౌళితో కలిసి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఉదయం రాజమౌళి సతీసమేతంగా కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని పురాతన హిమవద్ గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకులు రాజమౌళి దంపతులకు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన రాజమౌళి దంపతులు మొక్కు తీర్చుకోవడానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం కర్ణాటకలోని బండీపూర్ అభయారణ్యంలో భార్యతో కలిసి విహరించిన రాజమౌళి.. అభయారణ్యం పరిసరాల్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో బస చేసినట్లు సమాచారం.
కాగా, హిమవద్ గోపాలస్వామి టెంపుల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బండీపూర్ అభయారణ్యంలో పులి సంరక్షణ ప్రాంతాన్ని చేరుకున్నారట. రాజమౌళి దంపతులు జీపులో అభయారణ్యంలో కలియదిరుగుతూ అటవీ సిబ్బంది ద్వారా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. అయితే రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కాస్త రిలాక్స్ అవడానికి టూర్ కి వెళ్ళుంటాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మొక్కు తీర్చుకోడానికి వెళ్లారని అంటున్నారు. ఇంకొందరు మాత్రం పనిలో పనిగా 'ఆర్.ఆర్.ఆర్' లొకేషన్స్ కూడా చూడటానికి వెళ్లుంటారని అంటున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఇప్పటికే 70 శాతం పూర్తయింది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా దీని కోసం వర్కౌట్స్ స్టార్ట్ చేశారు.