Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ జక్కన్నతోనా...? |
By: Tupaki Desk | 18 April 2020 12:23 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఇది ఎప్పటి నుండి సినీ ఇండస్ట్రీలో వింటున్న మాటే. ఈ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి కానీ ఈ కాంబోకి శ్రీకారం మాత్రం పడలేదు. ఈ న్యూస్ వచ్చిన ప్రతిసారి సినీ అభిమానులు సంతోష పడుతుంటారు. వెంటనే అది నిజం కాదని తెలిసి నీరుగారి పోతుంటారు. ఈ వార్తలు వచ్చిన ప్రతిసారి మహేష్ - రాజమౌళి వారి తదుపరి చిత్రాలను వేరే వాళ్లతో ప్రకటించి అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం జక్కన్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్.' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సూపర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఎప్పుడు అనే ఉత్కంఠతకు తెరపడిందట. ఈ న్యూస్ తో సినీ అభిమానుల నిరీక్షణ ఫలించినట్లే అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ తో సినిమా అనే వార్తలపై రాజమౌళి ఈ మధ్య స్పందించాడట.
ఈ సందర్భంగా 'ఆర్.ఆర్.ఆర్' తరవాత తన ప్రాజెక్టు మహేష్ బాబుతోనే అని జక్కన్న ధృవీకరించాడట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. కేఎల్ నారాయణ కూడా వీరి కాంబినేషన్ లో సినిమా తీయబోతున్నానంటూ ఎప్పటి నుండో చెప్తున్నాడు. దీనికోసం వీరిద్దరి దగ్గర కమ్మిమెంట్ కూడా తీసుకున్నాడు. మహేష్ బాబు - రాజమౌళి కాంబో సినిమా చూడాలని తెలుగు చిత్రసీమ కలలు కంటోంది. వీరిద్దరినీ ఈ సినిమా గురించి ఎప్పుడు అడిగినా అతి త్వరలో అంటూ సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న 'ఆర్.ఆర్.ఆర్' విడుదల అవుతోంది. అదే యేడాది మహేష్ బాబు - పరశురామ్ సినిమాని పూర్తి చేస్తారు. సో వచ్చే ఏడాది సూపర్ స్టార్ - దర్శకధీరుడి కాంబో పట్టాలెక్కబోతుందన్నమాట.