Begin typing your search above and press return to search.

తమన్నాలా రియల్‌ స్టంట్స్‌ చేయగలరా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 11:30 PM IST
తమన్నాలా రియల్‌ స్టంట్స్‌ చేయగలరా?
X
బాహుబలి చిత్రంలో తమన్నా క్యారెక్టర్‌ కి సంబంధించిన చిత్రీకరణ పూర్తవ్వగానే ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ మాటన్నారు. ఇన్నేళ్లలో ఇంత కమిట్‌ మెంట్‌ ఉన్న నటిని చూడనేలేదు. తమన్నాతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం .. అని పొగిడేశాడు. అయితే అలా జక్కన్న ఎందుకన్నారో ఆ తర్వాత సినిమా చూశాక అందరికీ అర్థమైంది. వెండితెరపై అవంతికగా కత్తి పట్టి వీరనారిని తలపించింది. అంతెత్తున ఎగిరెగిరి వెళుతూ శత్రువు పని పట్టడంలో సఫలమైంది. అంతేనా దీవర సాంగ్‌ లో తమన్నా ఫీట్స్‌ కళ్లు చెదిరేట్టు చేశాయి. దీవర .. సాంగ్‌ విజువలైజేషన్‌ లో తమన్నా ఫీట్లు, కవ్వింత కుర్రకారుకు విపరీతంగా నచ్చేశాయంటే.. దానికి కారణం తమన్నా డేరింగ్‌ అండ్‌ డ్యాషింగే.

దీవర సాంగ్‌ మేకింగ్‌ వీడియోల్లో తమన్నా పార్ట్‌ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తుంది. భారీ రోప్‌ లు, క్రేన్‌ లతో గాల్లోకి ఎగిరేట్టు చేశారు. అలాంటి ఫీట్లు కథానాయికల చేత నేరుగా చేయించడం అరుదు. బాడీ డబుల్‌ ఆర్టిస్టుతో చేయించాల్సినవి కూడా ఒరిజినాలిటీ కోసం మిల్కీ తోనే చేయించేశారు. దీవర అంటూ శివుడిని తన వెంటే తిప్పుకుంటూ అలా అలా జలపాతాలు, కొండల్లోకి ఎగిరెగిరి వెళ్లిపోతుంటుంది అవంతిక. అలా ఎగరాలంటే రోప్‌ సాయం ఉన్నా కాస్త గుండె ధైర్యం కూడా కావాలి. ఇలాంటి డేర్‌ మిగతా నాయికలకు ఉంటుందా? అందుకే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన రాజమౌళి అంత పెద్ద కాంప్లిమెంట్‌ ఇచ్చారన్నమాట!