Begin typing your search above and press return to search.

రాజమౌళి మైత్రి బంధం

By:  Tupaki Desk   |   10 Jun 2018 5:41 AM GMT
రాజమౌళి మైత్రి బంధం
X
బాహుబలి 2 వచ్చి ఏడాది దాటుతోంది. అయినా కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టని రాజమౌళి తారక్-చరణ్ మల్టీ స్టారర్ కోసం తెరవెనుక ఏర్పాట్లలో మునిగితేలుతున్నాడు. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీని కథకు అనుగుణంగా తీర్చే దిద్దే పని మొదలయ్యింది. షూటింగ్ మొదలుకావడానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు మాత్రం చకచక జరిగిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తానని నిర్మాత డివివి దానయ్య ఇదివరకే ప్రకటించారు. ఎంత లేదన్నా రెండేళ్లు నిర్మాణానికి సమయం పట్టేలా ఉండటంతో విడుదల 2020లోనే ఉండబోతోంది. దాని తర్వాత జక్కన్న ఎవరికి చేస్తాడు అనే దాని మీద ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణకు గతంలోనే కమిట్ అయినట్టు వార్త ఉంది కానీ దాని గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. చరణ్ మల్టీ స్టారర్ లోనే దానయ్యతో భాగస్వామ్యం చేయిస్తారేమో అనుకున్నారు కానీ చివరికి అది దానయ్యకు సోలో కార్డు అయ్యింది.

విశ్వసనీయ సమాచారం మేరకు సినిమాల నిర్మాణంలో తమకంటూ ప్రత్యేకమైన మార్క్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కో సినిమా చేసేలా రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని దాని సారాంశం. కానీ అది ఇప్పుడు కాదు. రెండేళ్ల తర్వాత.. కథ ఏంటి హీరో ఎవరు టీమ్ ఇంకా ఏది డిసైడ్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మల్టీ స్టారర్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు రాజమౌళి దీని గురించి ఆలోచిస్తాడట. మైత్రి సంస్థ ఇప్పటి దాకా స్టార్ హీరోస్ తో తీసిన మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా మిగిలిపోవడంతో పాటు ఇప్పుడు సెట్స్ మీదున్న సవ్యసాచి-అమర్ అక్బర్ ఆంటోనీ అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో బ్రాండ్ ఇమేజ్ అమాంతం పైకి ఎగబాకుతోంది. సినిమాల పట్ల నిర్మాతల ప్యాషన్ గమనించిన రాజమౌళి ఆ కారణంగానే ఓకే చెప్పినట్టు టాక్. దీని గురించి చర్చ వచ్చే లోపు మల్టీ స్టారర్ హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. మరి మైత్రి సంస్థకు చేసే మూవీకి కూడా నాన్న విజయేంద్ర ప్రసాదే కథ ఇస్తారా లేక రూట్ మార్చి కొత్తగా ఏదైనా ట్రై చేస్తారా రాజమౌళి ఒక్కడికే తెలుసు. చూద్దాం.