Begin typing your search above and press return to search.

'అలియా ఫెంటాస్టిక్‌ పర్ఫామర్‌.. 'ఆర్.ఆర్.ఆర్'లో ఆమె ఫర్ఫెక్ట్ గా సూట్‌ అవుతుంది'

By:  Tupaki Desk   |   3 Oct 2020 6:30 PM IST
అలియా ఫెంటాస్టిక్‌ పర్ఫామర్‌.. ఆర్.ఆర్.ఆర్లో ఆమె ఫర్ఫెక్ట్ గా సూట్‌ అవుతుంది
X
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్‌''. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్ర చేస్తుంటే.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్‌ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్‌ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ని తీసుకున్నారు. అయితే అలియా ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అలియా భట్ పై బాలీవుడ్ లో పెద్ద ఎత్తున నెగెటివిటీ ప్రభావం పడింది. అందుకే అలియా భట్ 'సడక్ 2' ట్రైలర్ ని ప్రపంచంలోనే అత్యధిక మంది డిస్ లైక్స్ కొట్టి చెత్త రికార్డ్ ని మూటగట్టారు. ఈ నేపథ్యంలో అలియా ఎఫెక్ట్ 'ఆర్.ఆర్.ఆర్'పై కూడా పడే అవకాశం ఉందని.. అందుకే ఆమెను మేకర్స్ తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి అలియా భట్ పాత్రపై క్లారిటీ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో 'సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత విమర్శలు ఎదుర్కుంటున్న ఆలియా భట్‌.. మీ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో నటించడం వల్ల ఆమె ఆ ఫేజ్‌ నుండి బయటకు వస్తుందని అనుకుంటున్నారా?' అని సదరు యాంకర్ ప్రశ్నించింది. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. ''న్యూస్ ఫాలో అవడం మానేసి చాలా రోజులు అయింది. నాకు సుశాంత్‌ కు సంబంధించిన న్యూస్‌ లో జనరల్‌ ఐడియా ఉంది. ఆలియా భట్‌ ఫెంటాస్టిక్‌ పెర్ఫామర్‌. మా సినిమాలో చేయాల్సిన క్యారక్టర్ కి తను ఫర్ఫెక్ట్ గా సూట్‌ అవుతుంది. అందుకనే ఆమెను అప్రోచ్‌ అయ్యాం. తను కూడా ఎగ్జైట్‌ అయ్యి ఈ సినిమాలో యాక్ట్‌ చేయడానికి ఒప్పుకుంది. తన పర్సనల్ లైఫ్‌ లో ఏదో జరుగుతుంది అనేది నాకు తెలియదు.. అది నా సినిమాపై ఎఫెక్ట్‌ అవుతుందని అనుకోవడం లేదు. నా సినిమా తన లైఫ్ పై ఎలా ఎఫెక్ట్ అవుద్దో నాకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే అరుపులు కేకలు పైపైన ఉండేవే. వ్యక్తిగత జీవితంలో ఏదో జరుగుతుందని ఆలోచించి థియేటర్‌ కు ఆడియెన్స్‌ వస్తారని అనుకోవడం లేదు.. దాన్ని బేస్‌ చేసుకుని సినిమా చూడాలని అనుకోడు. సినిమాని ఆర్టిస్టుల అవుట్ సైడ్ లైఫ్ ఎఫెక్ట్ చేస్తుందని నేను నమ్మను'' అని చెప్పుకొచ్చాడు.