Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కు లైన్ క్లీయర్ చేస్తున్న రాజమౌళి!
By: Tupaki Desk | 15 Nov 2020 1:40 PM ISTఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ ఆ వెంటనే ఎన్టీఆర్ హీరోగా సినిమాను చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా ఎన్టీఆర్ చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. షూటింగ్ కు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో రామ్ తో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే మార్చిలో సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే హీరోలు ఇద్దరు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ ఒక్క సినిమా కోసం టైం ఎక్కువ కేటాయించారు. కనుక ఇప్పటికి అయినా వారిని కొత్త సినిమాలకు కమిట్ అవ్వనిచ్చే ఉద్దేశ్యంతో ఆర్‌ఆర్‌ఆర్ ను త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేయబోతున్నారు. మార్చి లేదా ఏప్రిల్ వరకు సినిమా పూర్తి చేయనున్నారు. అందుకే త్రివిక్రమ్ కు మార్చి నుండి ఎన్టీఆర్ డేట్లు ఇచ్చేందుకు రాజమౌళి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.
ఈ లోపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఇంకా హీరోయిన్స్ ముఖ్య నటీనటులు అంతా కూడా పాల్గొంటున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా వరకు రాజమౌళి తీసుకు రాబోతున్నాడు. ఇక ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.