Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' - 'మహాభారతం' ప్రాజెక్ట్స్ పై జక్కన్న క్లారిటీ...!

By:  Tupaki Desk   |   23 Aug 2020 1:20 PM IST
ఆర్.ఆర్.ఆర్ - మహాభారతం ప్రాజెక్ట్స్ పై జక్కన్న క్లారిటీ...!
X
దర్శకధీరుడు రాజమౌళి కరోనా నుంచి కోలుకున్న తరువాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో కరోనా అనుభవాలను 'ఆర్.ఆర్.ఆర్' 'మహాభారతం' ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాల గురించి వివరించారు. కరోనా టైమ్ లో రాజమౌళి తీసుకున్న జాగ్రత్తల గురించి చెప్తూ.. శ్వాసకు సంబంధించిన వ్యాయామం మరియు ఆవిరి పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చని అన్నారు. అంతేకాకుండా తగినంత నిద్ర అవసరమని అలాగే టైమ్ కి ఫుడ్ తీసుకుంటే వైరస్ రాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో నిజంగా తనకు ఏ మాత్రం క్లారిటీ లేదని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని అనుకుంటున్నాని.. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయితే 6 నెలల సమయంలో పనులను పూర్తి చేసేలా సిద్ధమవుతామని రాజమౌళి చెప్పుకొచ్చారు. 'ఆర్.ఆర్.ఆర్' నుంచి ఎన్టీఆర్ అప్డేట్ గురించి మాట్లాడుతూ.. షూటింగ్ మొద‌లుపెట్టిన‌ పది రోజుల తర్వాత తారక్ కి సంబంధించిన విజువల్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

అలానే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' గురించి స్పందించిన ఆయన 'ఆ సినిమాను తెరకెక్కించాలి అంటే బాహుబలి కంటే పదింతలు ఎక్కువగా కష్టపడాలని.. ఒకవేళ తీస్తే 10 ఏళ్ళ సమయం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక డార్లింగ్ ప్రభాస్ 'ఆది పురుష్' ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. 'అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న సమయంలో నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుండటం మంచి విషయమని.. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుందని.. ఆ సినిమా పోస్టర్ చూడగానే చాలా బాగా నచ్చిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.