Begin typing your search above and press return to search.

చరణ్ అండ్ ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన జక్కన్న!

By:  Tupaki Desk   |   20 April 2020 6:45 PM IST
చరణ్ అండ్ ఎన్టీఆర్ కి ఛాలెంజ్ విసిరిన జక్కన్న!
X
కరోనా దెబ్బతో లాక్ డౌన్ లో ఉన్న సినీ సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితం అవ్వడంతో ఇంటి పని - వంట పని చేస్తూ తమ తోటి వారి చేత కూడా చేయించే పనిలో పడ్డారు. 'అర్జున్‌ రెడ్డి' దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వంట సామానులు కడుగుతూ - ఇంటిని శుభ్రం చేస్తూ వీడియోను రికార్డు చేసి నిన్న ట్విట్టర్‌ లో షేర్‌ చేసి ‘బీ ద రియల్‌ మెన్‌’ అని రాజమౌళికి ఛాలెంజ్‌ విసిరాడు. అయితే సందీప్ సవాల్‌ ను స్వీకరించిన రాజమౌళి - ఇంటి పని చేస్తూ ప్లోర్ శుభ్రం చేస్తూ ఉన్న వీడియోని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ - ఎంఎం కీరవాణి - డైరెక్టర్ సుకుమార్ లకు ఛాలెంజ్‌ విసిరాడు. ఇక రాజమౌళి పోస్ట్ చేసిన వీడియోలో.. రాజమౌళి కిటికీ గ్రిల్స్ శుభ్రం చేస్తూ.. ఫ్లోర్ కడుగుతూ కనిపించాడు. అలాగే వీడియో చివరి షాట్‌ లో రాజమౌళి తన భార్య రమా వెనుక నిలబడ్డాడు. మరి రాజమౌళి ఛాలెంజ్ కి ఎన్టీఆర్ - చరణ్ నుండి ఏ రేంజ్ వీడియో బయటకు వస్తోందో చూడాలి.

ఇక రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి దేశమంతా దేశభక్తి గురించి సినిమా ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా - ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని - కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేంటి స్నేహం గురించి తీసే సినిమాలో అల్లూరి - కొమరం భీమ్ లు ఎందుకని అడగగా.. చెప్పాను కదా ఇది కల్పిత కథ అంటూ జవాబిచ్చాడు రాజమౌళి. బాహుబలికి జరిగేటప్పుడే ఎన్టీఆర్ రాంచరణ్ లను ఒకే తెరపై చూపించాలని అనుకున్నానని.. ఈ సినిమాతో అది కుదిరిందని తెలిపాడు. రాజమౌళి ఇచ్చిన క్లారిటీతో సినీ అభిమానులకు విశ్లేషకులకు దిమ్మతిరిగి పోతుంది. చూడాలి మరి ముందు ముందు ప్రజల నుండి ప్రముఖుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో..!