Begin typing your search above and press return to search.

బాహుబలి కథ 2 తో ముగుస్తుంది -రాజమౌళి

By:  Tupaki Desk   |   24 Oct 2015 6:27 PM IST
బాహుబలి కథ 2 తో ముగుస్తుంది -రాజమౌళి
X
బాహుబలి 3 సినిమా వస్తోంది.. 2020లో రిలీజ్‌.. ఇలాంటి రూమర్లన్నీ వింటూనే ఉన్నాం. అయితే అప్పటివరకు బాహుబలి ప్రభాస్‌ డేట్లన్నీ లాక్‌ అయిపోయినట్లేనా అని ఆయన అభిమానులు కూడా వర్రీ అయిపోయారు. ఇకపోతే ఈ మొత్తం యవ్వారంపై జక్కన ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

''బాహుబలి 1 లో మొదలైన కత.. బాహుబలి 2 తో ముగుస్తుంది. దాంట్లో ఏ సందేహమూ లేదు. కాని బాహుబలి ప్రపంచం అనేది ఆ తరువాత ఎవరూ ఊహించని రీతిలో కంటిన్యూ అవుతుంది. దాని గురించి సమయం వచ్చినప్పుడు చెబుతా..'' అంటూ సెలవిచ్చాడు రాజమౌళి. అంటే.. ప్రభాస్‌ తో మొదలుపెట్టిన బాహుబలి సినిమాను రెండు భాగాల్లో ముగిస్తున్నాడు.. అందులో సందేహమే లేదు. సో.. ప్రభాస్‌ బాహుబలి 2 తరువాత వేరే సినిమాలు చేసుకోవచ్చు.

ఇకపోతే బాహుబలి తరువాత కంటిన్యూ అవుతుంది అంటూ రాజమౌళి చెబుతున్నాడంటే.. ఖచ్చితంగా మరో హీరో ఎవరితోనో మూడో పార్టు ఏమన్నా నిర్మిస్తాడేమో. ఒకవేళ 1-2-3 అంటూ సీరీస్‌ వేయకపోయినా.. జేమ్స్‌ బాండ్‌ సినిమాల తరహాలో బాహుబలి క్యారెక్టర్ ను ఒక ఐకానిక్‌ రోల్‌ గా మారుస్తాడేమో మన గురుడు.