Begin typing your search above and press return to search.

బాహుబలి 3 ఉంటుంది.. జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   16 Dec 2021 8:32 AM GMT
బాహుబలి 3 ఉంటుంది.. జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్‌ ను మించేలా చేసిన సినిమా బాహుబలి అనడంలో సందేహం లేదు. బాహుబలి రెండు పార్టు లు కూడా ఒక అద్బుత కళా ఖండం అన్నట్లుగా ఉంటాయి. ముఖ్యంగా బాహుబలి 2 ను విజువల్ వండర్ గా అభివర్ణించారు విశ్లేషకులు. ఇండియన్‌ అవతార్‌ అనడంలో కూడా సందేహం లేదని కొందరు నెటిజన్స్ ఆ సినిమా సమయంలో విశ్లేషించారు. అంతటి గొప్ప బాహుబలిని మళ్లీ మళ్లీ కొత్తగా చూడాలని అభిమానులు కోరుకోవడం చాలా సహజమైన విషయం. ఎన్నో అద్బుతమైన కథలు మరియు ఎన్నో గొప్ప పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్ సినిమా తో అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రలను తనదైన ఒక ఫిక్షన్ కథతో చూపించబోతున్నాడు.

సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ను భారీ ఎత్తున జక్కన్న ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్బంగా మహేష్‌ బాబు తో తన తదుపరి సినిమాను గురించి క్లారిటీ అయితే ఇచ్చాడు. కాని ఎప్పుడు ఏంటీ అనే విషయంలో మాత్రం ఒక స్పష్టత ఇవ్వలేదు. ఇక బాహబులి 3 సినిమా గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాహుబలి సినిమా మూడవ భాగం ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంను రాజమౌళి వ్యక్తం చేశాడు. బాహుబలి మూడవ పార్ట్ కు ఖచ్చితంగా స్కోప్ ఉంది. కనుక ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా బాహుబలి 3 ఉంటుందని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు.

రాజమౌళి తాజాగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా బాహుబలి 3 ని ప్రకటించాడు. కాని ఇప్పుడే ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలను ప్రకటించాలని భావించడం లేదు అన్నాడు. ఇప్పుడే బాహుబలి 3 గురించి ఎలాంటి ప్రకటన చేసినా కూడా ఖచ్చితంగా అంతా ఫోకస్‌ అటు వెళ్తుంది. అందుకే ఇప్పుడే ఎలాంటి విషయాన్ని తాను చెప్పలేను అన్నాడు. కాని ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా బాహుబలి 3 ఉంటుందనే నమ్మకం మాత్రం సామాన్య జనాల్లో కలుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా జక్కన్న బాహుబలి 3 చేసే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్‌ బాబుతో అనే విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత బాహుబలి 3 ఉంటుందేమో చూడాలి.