Begin typing your search above and press return to search.

#RRR: రాజమౌళి ఆడిషన్స్?

By:  Tupaki Desk   |   27 Jun 2018 7:34 AM GMT
#RRR: రాజమౌళి ఆడిషన్స్?
X
సాధారణంగా కొత్త నటీనటులు కావాలని ఎవరైనా ఆడిషన్స్ నిర్వహిస్తే చాలా మందికి ఆఫీస్ ల ముందు వాలిపోతారు. ఇక రాజమౌళి అదే తరహాలో చేస్తే జనాలు ఏ రేంజ్ లో వస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చాలా వరకు ప్రముఖ తారలే రాజమౌళి సినిమాలో నటించాలని ఆయన ఆఫీస్ ముందు ఉంటారు. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం జక్కన్న #RRR స్క్రిప్ట్స్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

త్వరలో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. నిర్మాత దానయ్య చెప్పినదాన్ని బట్టి మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే ఈ లోపు సినిమాలో క్యారెక్టర్స్ కి నటీనటులను ఫైనల్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇప్పటికే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీర్తి సురేష్ హీరోయిన్స్ గా సెట్ అయ్యారని జగపతి బాబుని కూడా విలన్ గా ఫైనల్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చరణ్ తారక్ తప్ప సినిమాలో ఎవరు ఫిక్స్ కాలేదని గతంలోనే నిర్మాత సమాధానం ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం నూతన నటీనటులను ఎంపిక చేసుకుంటే బావుంటుందని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. అందుకే ఫ్రెష్ ఫెసెస్ కోసం ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కొత్త నటీనటులు అంతగా కనిపించరు. కుదిరితే సీరియల్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఈ సారి మల్టి స్టారర్ కోసం ఆయన చేస్తున్న ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.