Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం రాజమౌళి, వినాయక్..

By:  Tupaki Desk   |   22 Jun 2016 9:02 AM GMT
ఆ సినిమా కోసం రాజమౌళి, వినాయక్..
X
కుందనపు బొమ్మ.. ఎప్పుడో మొదలై.. ఇంకెప్పుడో పూర్తయి.. చాలా కాలంగా వార్తల్లో లేకుండా పోయిన సినిమా. ఐతే ఉన్నట్లుండి ఈ శుక్రవారం విడుదలకు సిద్ధం చేశారు. రాఘవేంద్రరావు సమర్పణ.. ఎం.ఎం.కీరవాణి సంగీతం.. పోస్టర్ మీద పెద్ద పెద్దోళ్ల పేర్లే కనిపిస్తున్నాయి. ముళ్లపూడి రమణ కొడుకు.. బాపు అల్లుడు అయిన ముళ్లపూడి వర ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చాన్నాళ్లు మరుగున పడిపోయినప్పటికీ.. విడుదల తేదీ ప్రకటించాక సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ బలంగా ఉన్నోడు కదా.. పెద్ద పెద్ద వాళ్లంతా వచ్చి సినిమాకు అండగా నిలుస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి.. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం విశేషం.

కుందనపు బొమ్మ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతూ.. ఈ నెల 24న విడుదల కాబోయే ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని రాజమౌళి బైట్ ఇవ్వగా.. వి.వి.వినాయక్ సినిమా గురించి కొంచెం లెంగ్తీగానే మాట్లాడాడు. ‘‘ముళ్లపూడి వర దర్శకత్వంలో రాబోతున్న ‘కుందనపు బొమ్మ’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక గజల్ షూట్ చేశారు. మంచి ఐడియాతో మంచి కాన్సెప్టుతో చేసిన ప్రయత్నమది. తెలుుగలో ఇలా ఇంకెవ్వరూ చేయలేదు. రాఘవేంద్రరావు స్క్రిప్టు నచ్చి ఆయన కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా ఇది. బాపు-రమణగార్లంటే ఇష్టపడని వాళ్లు ఇండస్ట్రీలో ఎవ్వరూ ఉండరు. రమణగారి వారసుడు దర్శకుడిగా విజయవంతం కావాలని దర్శకత్వ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలి’’ అని వినాయక్ అన్నాడు.