Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీకి మరో పిచ్చోడు దొరికాడు: రాజమౌళి

By:  Tupaki Desk   |   31 May 2022 2:30 PM GMT
ఇండస్ట్రీకి మరో పిచ్చోడు దొరికాడు: రాజమౌళి
X
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ''బ్రహ్మాస్త్ర'' సినిమాకి సౌత్ ఇండియాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బ‌చ్చ‌న్ - అక్కినేని నాగార్జున - మౌనీరాయ్‌ ప్ర‌ధాన పాత్రలతో రూపొందిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఇది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''బ్రహ్మాస్త్ర: శివ'' పేరుతో విడుదల చేయబోతున్నారు. 2022 సెప్టెంబ‌ర్ 9న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఉదయం వైజాగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

'బ్రహ్మాస్త్ర' ప్రెస్ మీట్ కు రాజమౌళితో పాటుగా హీరో రణబీర్ కపూర్ మరియు దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరయ్యారు. విడుదలకు 100 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ట్రైలర్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. జూన్ 15న ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ 'బ్రహ్మాస్త్ర' డైరెక్టర్ అయాన్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించాడు. ''ఒకసారి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. నువ్వు ఒక్కసారి మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చెప్పే కథ వినండి. మీకు నచ్చితే సౌత్ ఇండియాలో ఈ సినిమాకు ప్రెజంటర్ గా ఉండండి' అని అన్నారు. నేను సరే అన్నాను''

అయాన్ చెప్పిన కథ కన్నా అతనిలో ఉన్న ఎగ్జైట్మెంట్ మరియు సినిమా పట్ల తనకున్న ప్రేమను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అతను తయారు చేసుకున్న విజువల్స్ - షూట్ చేసిన మెటీరియల్స్ చూపిస్తుంటే సినీ ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయిపోయాను. చాలా ఇంట్రెస్టింగ్ గా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలనుకునే ఓ పెద్ద సినిమాని రెడీ చేసాడు'' అని రాజమౌళి చెప్పారు.

తనకు 20 నిమిషాల సినిమా మాత్రమే చూపించారని.. తన తండ్రికి (విజయేంద్ర ప్రసాద్) మాత్రం సినిమా మొత్తం చూపించారని జక్కన్న తెలిపారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా చూసిన తన తండ్రి.. ఒక బ్లాక్ బస్టర్ తీసి రెడీగా పెట్టుకున్నారని అన్నాడని రాజమౌళి చెప్పారు. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి రెండు మెతుకులు చాలు.. అయాన్ చూపించిన 20 నిమిషాల విజువల్స్ తోనే అద్భుతమైన సినిమా చూపించాడని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మీడియా మీట్ లో తెలుగులో ఫేవరేట్ యాక్టర్ ఎవరని రణబీర్ కపూర్ ని అడగ్గా.. ప్రభాస్ అంటేతనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ''నేను నా డార్లింగ్ ప్రభాస్‌ ని చాలా ఇష్టపడతానని చెబుతాను. అతను నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. ఇక్కడ అందరూ గ్రేట్ యాక్టర్స్. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం నేను ప్రభాస్ పేరు చెబుతాను'' అని రణవీర్ పేర్కొన్నారు.

అంతకుముందు విశాఖపట్నంలో రాజమౌళి - రణ్‌ బీర్‌ - అయాన్‌ ముఖర్జీలకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రణ్‌ బీర్‌ కు క్రేన్ సాయంతో గజమాలతో అభిమానులు ఆయన్ని సత్కరించారు. రణ్‌ బీర్‌ కూడా కూడా ఫ్యాన్స్‌ కు అభివాదం చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి.