Begin typing your search above and press return to search.

రాజా విక్రమార్క కోసం మెగాహీరో

By:  Tupaki Desk   |   3 Sep 2021 4:30 PM GMT
రాజా విక్రమార్క కోసం మెగాహీరో
X
కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో రూపొందిన రాజా విక్రమార్క సినిమా టీజర్ విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ఫస్ట్‌ లుక్ ను విడుదల చేసి అంచనాలు పెంచారు. తాజాగా టీజర్ ను విడుదల చేయడం ద్వారా అంచనాలు మరింతగా పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ తో సినిమా మార్కెట్ ను పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది టాక్‌.

థ్రిల్లర్ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ గా రూపొందుతున్న రాజా విక్రమార్క సినిమా టీజర్ ను మెగా హీరో వరుణ్‌ తేజ్ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విభిన్నమైన కథ మరియు కథనం ఉంటుందని అంటున్నారు. కార్తికేయ ఈ సినిమాతో నటుడిగా మరింత మంచి పేరును దక్కించుకుంటాడు అనే టాక్ వినిపిస్తుంది.

కార్తికేయ ఇటీవలే పెళ్లికి సిద్దం అయ్యాడు. తన ప్రియురాలితో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ కొత్త జీవితం ఆరంభించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలో ఆయన నుండి రాబోతున్న ఈ సినిమా చాలా కీలకంగా మారింది. కొత్త జీవిత భాగస్వామి రాబోతున్న సమయంలో కొత్త సినిమా తో కార్తికేయ ఆకట్టుకుంటాడేమో చూడాలి. మెగా హీరో చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ కనుక ఖచ్చితంగా సినిమా పై అంచనాలు భారీగా ఉంటాయి. మరి కార్తికేయ ఆ అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.