Begin typing your search above and press return to search.

‘ఊపిరి’తో ఆ నటుడు భారీగా మోసపోయాడా?

By:  Tupaki Desk   |   3 April 2016 3:30 PM GMT
‘ఊపిరి’తో ఆ నటుడు భారీగా మోసపోయాడా?
X
ఊహించిన దాని కంటే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్న ఊపిరి చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటం తెలిసిందే. సరైన టైంలో విడుదల కాలేదని.. విడుదల తేదీ మరో రెండు వారాల ముందు కానీ ఉండి ఉంటే.. బాక్స్ ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేదంటూ విపరీతమైన పాజిటివ్ టాక్ ఈ సినిమా మీద నడుస్తోంది. ఈ మధ్య కాలంలో అన్ని వర్గాల వారు పాజిటివ్ గా రియాక్ట్ అయిన మూవీ ఏదైనా ఉందంటే అది.. ‘‘ఊపిరి’’గానే చెప్పలి.

అలాంటి ఈ సినిమా మీద తాజాగా ఒక వివాదం తెర మీదకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజారవీంద్ర అప్పుడెప్పుడో రిజిష్టర్ చేసి పెట్టుకున్నారట. అయితే.. ఈ టైటిల్ ను తమకు ఇచ్చినట్లైతే.. తామీ సినిమాలో మంచి పాత్ర ఇస్తామని ఆశ పెట్టారట. నిర్మాత.. దర్శకులు అంతగా ఊరించటంతో ఓకే చెప్పిన రాజా రవీంద్ర తన ‘ఊపిరి’ టైటిల్ ను ఇచ్చేశారట.

అయితే.. దర్శక నిర్మాతలు చెప్పిన దానికి భిన్నంగా సినిమాలో కాసేపే కనిపించటమే కాదు.. తనది ఒక్క డైలాగు మాత్రమే తెర మీద ఉండటంతో రాజారవీంద్ర కంగు తిన్నాడట. బంగారం లాంటి టైటిల్ ఇచ్చేసి.. దారుణంగా నమ్మి మోసపోయినట్లుగా తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. దీన్లో నిజం ఎంతన్నది ఊపిరి దర్శక నిర్మాతలు రియాక్ట్ అయితే కానీ తేలదు.