Begin typing your search above and press return to search.
అతడే 5 లక్షలు డిమాండ్ చేశాడు! -రాజా రవీంద్ర
By: Tupaki Desk | 23 Aug 2019 10:40 AM ISTఔటర్ లో యువహీరో రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసు రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. తాగిన మత్తులో గోడను ఢీకొట్టాడని .. అక్కడి నుంచి పారిపోవడం.. దొరక్కుండా తప్పించుకోవాలనుకోవడం తప్పయ్యిందని పోలీస్ వైపు నుంచి వెర్షన్ వినిపిస్తోంది. ఈ కేసులో వీడియో ఆధారాలు లభ్యం కావడంతో రాజ్ తరుణ్ .. అతడి మేనేజర్ రాజా రవీంద్రకు చిక్కులు ఎదురవుతున్నాయి. పోలీసులు సదరు యువహీరోపై కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ఉన్నట్టుండి ఈ సీన్ లోకి కార్తీక్ అనే కుర్రాడు ఎంటరై .. మొత్తం ఇన్సిడెంట్ ని తమ ఇంటిపై ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ చేశాయని.. బయటకు లీక్ చేయొద్దని తనకు డబ్బు ఆశ చూపారని చెప్పడంతో గొడవ కొత్త మలుపు తిరిగింది. ఐదు లక్షల వరకూ తనకు ముట్ట జెప్పేందుకు మేనేజర్ రాజా రవీంద్ర మంతనాలు సాగించారని అతడు చెబుతుండడంతో ఈ వివాదంలో డెప్త్ పెరిగింది. అయితే ఇది నిజమా? అతడికి డబ్బు ఆశ చూపించారా? మీపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఏమిటి? అని ప్రశ్నిస్తే.. దానికి నటుడు కం మేనేజర్ రాజా రవీంద్ర ఓ మీడియాకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
``వాస్తవంగా నాకు బెదిరించాల్సి న అవసరం లేదు. ఆ వీడియో చూస్తే ఏదో మర్డర్ ఏదీ జరగలేదు. తను రోడ్ పై వెళుతుంటే ఈయనే అడ్డు వెళ్లి.. కావాలని మొత్తం ప్లాన్ చేసి.. అన్నీ రికార్డ్ చేసి.. తనే అందరికీ ఫోన్లు చేసి చాలా చేశాడు. నేను ఫోన్ లు చేశానని అంటున్నాడు. నాకు అసలు అతడు ఎవరో కూడా తెలీదు. తనే మాకు పదే పదే ఫోన్లు చేశాడు. అతడి ఆరోపణలన్నీ అవాస్తవాలు. మేం చట్టపరంగా ముందుకు వెళతాం``అని తెలిపారు. అంతేకాదు.. అతడే 5లక్షలు డిమాండ్ చేశాడు. మా దగ్గర అంత డబ్బు లేదు అని అంటే రూ.3లక్షలు అడిగాడని రాజా రవీంద్ర వెల్లడించారు. అయితే ఈ కేసులో నిజానిజాలేమిటి? అన్నది పోలీసులే దర్యాప్తులో నిర్ధారించాల్సి ఉంటుంది.