Begin typing your search above and press return to search.
'బాలయ్యకు ఆ రెండే తెలుసు'
By: Tupaki Desk | 19 Aug 2020 2:00 PM ISTప్రముఖ సినీ నటుడు రాజా రవీంద్ర ఏదైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్పేస్తాడనే విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీలో చేరి గత ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజా రవీంద్ర రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మించిన నాయకుడు లేరని ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వాన్ని నడిపించే తీరు, సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న విధానం చూస్తుంటే ప్రతీ ఒక్కరు తమ ఇంట్లో దేవుడి ఫోటోతో పాటు ఆయన ఫొటోని కూడా పెట్టుకునే రోజు వస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 'ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదని.. త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుందని' నందమూరి బాలకృష చేసిన వ్యాఖ్యలపై కూడా రాజా రవీంద్ర స్పందించారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ''బాలయ్య ఈ కామెంట్స్ చేశారంటే ఆయనకు ఏదో అవగాహన ఉండి ఉంటుంది. ఎంతైనా ఆయన ఎమ్మెల్యే. ఆయనకు వేరే ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది.. ఊరికే ఇలాంటి కామెంట్స్ చేయరు కదా.. కచ్చితంగా ఆయన వ్యాఖ్యల వెనుక వేరే ఏదో ఉండే ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు.
ఇంకా బాలయ్య గురించి చెప్తూ ''బాలయ్య చిన్న పిల్లాడి మనస్తత్వం కలవాడు. మనసులో వేరే ఏం ఉండదు. కోపం వస్తే తిట్టేయడం.. ప్రేమ కలిగితే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాట్లాడటం. ఇవి రెండే ఆయనకి తెలుసు. ఆయనకు కోపం కూడా ప్రతిసారి రాదు. చాలామంది బాలయ్యకు కోపం ఎక్కువ అంటారు. కానీ ఆయనకి చాలా సహనం తరువాత మాత్రమే కోపం వస్తుంది. కోపం వచ్చిందటే డైరెక్ట్ గా చూపిస్తారు. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇక బాలయ్యకి పాట పాడాలనిపిస్తే పాడేస్తారు. అది నచ్చడం నచ్చకపోవడం వినేవాళ్ల ఛాయిస్. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. ఎవరైనా నచ్చకపోతే.. నువ్వు నచ్చలేదు.. నువ్వు నా ముందు కనిపించకు అని మొహం మీదే చెప్తారు. అప్పుడు కూడా కనిపిస్తే రెండు పీకుతారు. అది వేరే విషయం. వేరే వాళ్ల గురించి ఆయన దగ్గర తప్పుగా చెప్పినా.. నాకు తెలుసు నువ్వు పక్కకు వెళ్లు అంటారు'' అని రాజారవీంద్ర వెల్లడించారు.
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా యువ హీరోలకు మేనేజర్ గా వ్యవహరిస్తూ వస్తున్న రాజా రవీంద్ర ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కంటెంట్ క్రియేటర్స్ కి అవకాశం కల్పిస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వెబ్ సిరీస్, వెబ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ ఇలా ఏదైనా ఫ్రెష్ కంటెంట్ మీ దగ్గర ఉంటే సంప్రదించాలని రాజా రవీంద్ర వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు. త్వరలోనే రాజా రవీంద్ర దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.