Begin typing your search above and press return to search.

`రాజా రాజ చోర` సునైనకు బెస్ట్ ఛాయిస్

By:  Tupaki Desk   |   20 Aug 2021 4:38 AM GMT
`రాజా రాజ చోర` సునైనకు బెస్ట్ ఛాయిస్
X
టాలెంటెడ్ యంగ్ బ్యూటీ సునైనా 2005 లో టాలీవుడ్ లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2006 యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ టెంథ్ క్లాస్ చిత్రంతో న‌టిగా పాపుల‌రైంది. త‌న‌దైన అందం న‌ట‌న‌తో ఆరంభ రోజుల్లోనే ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ తరువాత చెన్నైకి వెళ్లి విజయ్ తేరిలో న‌టించింది. అట్లీ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధనుష్ ఎనాయి నోకి పాయుమ్ తోట .. అవార్డ్ విన్నింగ్ `సిల్లు కరుపాటి` వంటి సినిమాల ద్వారా కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.

`పెళ్లికి ముందు ప్రేమ కథ` అనే తెలుగు సినిమాలోనూ న‌టించింది. అటుపై 4 సంవత్సరాల తరువాత సునైన ఇప్పుడే విడుదలైన కామిక్ కేపర్ `రాజ రాజ చోర`తో టాలీవుడ్ లో ఘ‌న‌మైన రీఎంట్రీ ఇచ్చింది. శ్రీ విష్ణు నటించిన ఈ చిత్రంలో సునైన విద్యా అనే న్యాయవాది పాత్రలో నటించింది.

బలమైన పాత్రలో సునైన భావోద్వేగ ప్రదర్శన విమర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన‌ శైలి పాత్ర‌తో తిరిగి ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నం చాటుకుంది. స‌రైన స‌మ‌యంలో స‌రైన విజ‌యం. ఈ యంగ్ బ్యూటీ సినిమా విజయాన్ని క్యాష్ చేసుకుంటుందా లేదా? అన్న‌ది చూడాలి. సమీప భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాజ రాజ చోర చిత్రానికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఇందులో శ్రీ‌విష్ణు కామెడీ ఎమోష‌న‌ల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.