Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు.. 'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   11 Aug 2021 7:40 AM GMT
శ్రీవిష్ణు.. రాజ రాజ చోర రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ ''రాజ రాజ చోర‌''. హ‌సిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. సున‌య‌న కీలక పాత్ర పోషిస్తోంది. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన మేకర్స్.. టీజర్ - సాంగ్స్ తో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజైన చిత్రాలకు ప్రేక్షకాదరణ దక్కడంతో, 'రాజ రాజ చోర‌' మేకర్స్ కూడా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

'రాజ రాజ చోర' చిత్రాన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పాండమిక్ పరిస్థితుల్లో వినోదం కోసం రిలీఫ్ అవ్వాలని చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అపరిమిత ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయమని తెలుస్తోంది. ఇందులో శ్రీ విష్ణు ఒక తెలివైన దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ మరియు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాలపై రూపొందిస్తున్నారు. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

'రాజ రాజ చోర‌' చిత్రంలో తనికెళ్ళ భరణి - ర్రవిబాబు - కాదంబరి కిరణ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - అజయ్ ఘోష్ - వాసు ఇంటూరి - గంగవ్వ తదితరులు నటిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ నిషాదం ఎడిటింగ్ వర్క్ చేశారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.