Begin typing your search above and press return to search.

జీ5లో రాజ‌రాజ చోర చోరీ య‌త్నం?

By:  Tupaki Desk   |   15 Aug 2021 12:30 PM GMT
జీ5లో రాజ‌రాజ చోర చోరీ య‌త్నం?
X
శ్రీ విష్ణు న‌టించిన తాజా చిత్రం `రాజ రాజ చోర` ఈ నెల 19న థియేటర్లలో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ఈ సినిమా ప్ర‌చారంలో వేగం పెంచిన టీమ్ కాన్సెప్ట్ బేస్డ్ సాంగ్ ని రిలీజ్ చేసి ఆక‌ట్టుకుంది. ఎంతో విల‌క్ష‌ణ‌మైన ప్రమోషన్ లతో ప్రేక్షకులలో ఒక ముద్రను వేస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు జరుగ‌నుంది..

తాజా స‌మాచారం మేర‌కు జీ గ్రూప్ రాజ‌రాజ చోర శాటిలైట్ డిజిటల్ హక్కులు స‌హా మ్యూజిక్ రైట్స్ ని ఒక‌ ప్యాకేజీగా కొనుగోలు చేసింద‌ని తెలిసింది. జీ గ్రూప్ డిజిటల్ ప్లాట్ ఫామ్.. జీ 5 లో మూవీ థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ చేస్తారు. సినిమా ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలియాల్సి ఉంది.

`బ్రోచేవారెవరురా` చిత్రంతో హిట్ కొట్టాక‌ శ్రీ విష్ణు రెండు ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. తిప్పర మీసం .. గాలి సంపత్ అత‌డికి మైన‌స్. ఈ సినిమాతో అతను గ‌త‌ వైఫల్యాలనుంచి బ‌య‌ట‌ప‌డ‌తాన‌ని ధీమాతో ఉన్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు సునీల్ న‌టించిన క‌న‌బ‌డుట లేదు కూడా రిలీజ్ కానుంది.