Begin typing your search above and press return to search.

`రాజ రాజ చోర` వ‌సూళ్ల‌పై ట్రేడ్ టాక్

By:  Tupaki Desk   |   20 Aug 2021 12:30 PM IST
`రాజ రాజ చోర` వ‌సూళ్ల‌పై ట్రేడ్ టాక్
X
2020లో ఉప్పెన‌- జాతిర‌త్నాలు - నాంది లాంటి చిత్రాల‌కు ఓపెనింగ్ డే అద్భుత‌మైన రివ్యూలొచ్చాయి. స‌కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రాలుగా ఇవి పాపుల‌ర‌య్యాయి. ఉప్పెన - జాతి ర‌త్నాలు రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌ను తేవ‌డం ప‌రిశ్ర‌మ‌కు కొత్త క‌ళ‌ను తెచ్చింది. 2021లో సెకండ్ వేవ్ అనంత‌రం మ‌ళ్లీ అలాంటి వేవ్ పుట్టుకొస్తుందా? అంటూ సందేహించారు. కానీ శ్రీ‌విష్ణు ఘ‌న‌మైన ఆరంభాన్నిచ్చారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక సినిమాకి విమర్శకులు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఉద‌యం ఆట వ‌దిలేస్తే రాజ‌రాజ చోర‌ మ్యాట్నీ షోలకు బాక్సాఫీస్ వద్ద ఘ‌న‌మైన ఆరంభం అంటూ పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రాజ‌రాజ చోర చ‌క్క‌ని కామెడీ ఎమోష‌న్ తో ఆక‌ట్టుకుందంటూ సమీక్షలు రావ‌డంతో సాయంత్రం షోలకు వెళ్లేందుకు జ‌నం ఆస‌క్తి ని క‌న‌బ‌రిచారు. చాలా చోట్ల టూటైర్ సిటీల్లో థియేట‌ర్లు తెర‌వ‌డంతో మాస్ జ‌నం సినిమాల‌కు వెళ్లేందుకు ఆస‌క్తిగా ఉండ‌డం ఈ సినిమాకి ప్ల‌స్ కానుంది.

ఇక ఏపీలో ఇటీవ‌ల స్కూళ్లు తెరిచారు. అటు తెలంగాణ‌లోనూ విద్యార్థుల స్ట‌డీస్ కొన‌సాగుతున్నాయి. అందువ‌ల్ల యూత్ టీనేజ‌ర్లు సినిమాల‌కు వెళ్లేందుకు సెల‌వులు అనుకూలం. శుక్ర‌-శ‌ని-ఆదివారాలు సినిమాకి క‌లిసొస్తాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. మూడు సెలవు దినాలలో సినిమాకి ప్ల‌స్. టాక్ ని బ‌ట్టి మొదటి వారాంతంలో మంచి రిపోర్ట్ వ‌స్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇక రాజా రాజా చోరాతో పాటు విడుదలైన ఇతర చిత్రాలు అంత‌గా ఆకట్టుకోలేకపోవ‌డం అద‌నంగా క‌లిసొచ్చేందుకు వీలుంది.

శ్రీ విష్ణు త‌న కెరీర్ లో పెద్ద హిట్ సాధించడానికి ఆస్కారం ఉందని అంతా భావిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టు నిర్మాత‌లు చ‌క్క‌ని ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేశార‌ని తెలిసింది. క‌రోనా వేవ్ కూడా త‌గ్గుముఖం ప‌ట్టింది కాబ‌ట్టి ఇది రాజ రాజ చోర‌కు క‌లిసొచ్చేదేన‌ని విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రానికి న‌వ‌త‌రం ట్యాలెంట్ హసిత్ గోలి దర్శకత్వం వ‌హించారు.