Begin typing your search above and press return to search.

రాజా డీలక్స్‌ సెకండ్‌ రోల్‌ ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

By:  Tupaki Desk   |   12 Dec 2022 5:30 PM GMT
రాజా డీలక్స్‌ సెకండ్‌ రోల్‌ ఇంట్రెస్టింగ్‌ రూమర్‌
X
ప్రభాస్.. మారుతి కాంబినేషన్ లో సినిమా గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ అనేక విషయాలు సినిమా కు సంబంధించిన లీక్ అవుతున్నాయి. కొన్ని పుకార్లుగా పుట్టుకు వస్తూ ఉంటే మరి కొన్ని మాత్రం యూనిట్‌ సభ్యుల నుండి లీక్స్‌ రూపంలో వస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని... ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అని.. సంజయ్ దత్‌ ను తాత పాత్రలో దర్శకుడు మారుతి చూపించబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల నుండి లీక్ వచ్చిన విషయం తెల్సిందే. ఇంకా పలు విషయాలను యూనిట్‌ సభ్యులు లీక్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని ప్రభాస్ రెండో పాత్ర గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సెకండ్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్‌ ముందు వస్తుందట. రెండవ ప్రభాస్ ఎంట్రీ సీన్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రభాస్ మరియు మారుతి కాంబో సినిమాకు రాజా డీలక్స్ అంటూ మొదట ప్రచారం జరిగింది. కానీ పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో టైటిల్ మరేదైనా స్పెషల్‌ గా అన్ని భాషలకు తగ్గట్లుగా ఉండేలా మారుతి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ ఇప్పటి వరకు టచ్ చేయని విభిన్నమైన కమర్షియల్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ గా ఈ సినిమా ఉండబోతుందట. ముగ్గురు ముద్దుగుమ్మలు మరియు సంజయ్‌ దత్‌ తో పాటు ఇంకా ఈ సినిమాలు పలువురు స్టార్స్ సందడి చేయబోతున్నారట. కనుక ఈ సినిమా కచ్చితంగా మంచి థ్రిల్లర్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఇవ్వడం ఖాయం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.