Begin typing your search above and press return to search.

గోదావరి కుర్రాడు నక్కతోక తొక్కాడు

By:  Tupaki Desk   |   22 Aug 2015 11:27 PM GMT
గోదావరి కుర్రాడు నక్కతోక తొక్కాడు
X
ఉయ్యాల జంపాల సినిమాతో ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మార్కులు కొట్టేశాడు రాజ్ తరుణ్. తొలి సినిమాలోనే మెచ్యూర్డ్ గా నటించి మెప్పించిన తరుణ్ కు పేరుకు పేరు వచ్చింది, హిట్టూ ఖాతాలో పడింది. రెండో సినిమా ‘సినిమా చూపిస్త మావ’ కూడా రాజ్ తరుణ్ ఖాతాలో మరో విజయాన్ని జమ చేసింది. ఈ సినిమాలో గోదావరి కుర్రోడి యాక్టింగ్ చూసి ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోయారు. బ్యాగ్రౌండ్ లేకుండా హీరోలుగా నిలదొక్కుకున్న నాని, శర్వానంద్, నాగశౌర్య లాంటి యువ ప్రతిభావంతుల జాబితాలో రాజ్ తరుణ్ ను చేర్చేశారు. గతంలో వరుణ్ సందేశ్ వేసిన టైపు పాత్రలు ఇప్పుడు తరుణ్ నే వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇప్పటికే రాజ్ తరుణ్ ఖాతాలో మూడు సినిమాలుండగా.. ఇప్పుడో బంపర్ ఆఫర్ అతడి తలుపు తట్టింది. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థలో రాజ్ తరుణ్ హీరోగా చేయబోతున్నట్లు సమాచారం. గత ఏడాది వరకు మెగా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేసిన అల్లు అరవింద్.. కొత్తగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ ఆరంభించి బయటి హీరోలతో కూడా లో, మీడియం బడ్జెట్లలో సినిమాలు తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ముందుగా నానితో ‘భలే భలే మగాడివోయ్’ తీశాడు. తర్వాతి అవకాశం రాజ్ తరుణ్ ను వరించింది. ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మున్నా అనే కుర్రాడు దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రెండు మూడు రోజుల్లో రావచ్చు.