Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్‌ 'స్టాండప్‌ రాహుల్‌' మొదటి విజయం!!

By:  Tupaki Desk   |   16 March 2022 12:30 PM GMT
రాజ్ తరుణ్‌ స్టాండప్‌ రాహుల్‌ మొదటి విజయం!!
X
రాజ్ తరుణ్‌ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా రూపొందిన స్టాండప్ రాహుల్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈసినిమా సెన్సార్‌ కార్యక్రమాలు జరిగాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. కాస్త డబుల్‌ మీనింగ్ డైలాగ్స్ తో పాటు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం వల్ల ఈ సర్టిఫికెట్‌ ను స్టాండప్‌ రాహుల్‌ దక్కించుకున్నాడు అనేది టాక్‌.

ఇక ఈ సినిమాకు 134 నిమిషాల రన్‌ టైమ్‌ గా సెన్సార్‌ సర్టిఫికెట్‌ లో పేర్కొనడం జరిగింది. ఈ రన్‌ టైమ్‌ ఖచ్చితంగా సినిమాకు మంచి చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో రెండు గంటలు లేదా రెండుంపావు గంటల సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ సినిమా కు రన్‌ టైమ్‌ ఖచ్చితంగా మొదటి విజయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్ తరుణ్‌ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ సినిమాతో కమర్షియల్‌ హీరోగా గుర్తింపు దక్కించుకుని ఏకంగా జూనియర్‌ మాస్ మహారాజా అంటూ పేరును దక్కించుకున్నాడు. అయితే రాజ్ తరుణ్‌ కొన్ని సినిమాల ఎంపిక తప్పడంతో నిరాశ పర్చాడు. కాని ఆయన అంటూ అభిమానించే వారు చాలా మందే ఉన్నారు.

ఇటీవల విడుదల అయిన అనుభవించు రాజా సినిమా లో కూడా ఆయన మాస్‌ యాక్టింగ్‌ కు కామెడీ టైమింగ్‌ కు అభిమానులు ఫిదా అయ్యాయి. ఈసారి కెరీర్‌ పై ఒక క్లారిటీ లేని కుర్రాడిగా ముందుకు వెళ్తు జీవితంలో ఏది నచ్చితే అది చేయాలని భావించే పాత్రలో స్టాండప్‌ రాహుల్‌ సినిమాలో కనిపించబోతున్నాడు.

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వర్ష కు ఇప్పటికే తెలుగు లో మంచి గుర్తింపు వచ్చింది. కనుక ఈ సినిమా ఆమెకు మరింతగా స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.