Begin typing your search above and press return to search.

రాజ్ త‌రుణ్ సిత్రాలు సూడండి!

By:  Tupaki Desk   |   17 Nov 2015 10:30 PM GMT
రాజ్ త‌రుణ్ సిత్రాలు సూడండి!
X
ఉయ్యాల జంపాలాతో ఊపేసిన రాజ్‌ త‌రుణ్ - సినిమా చూపిస్త మావ తో చంపేశావురా... అబ్బాయి అనిపించుకున్నాడు.ఇలా రెండు సినిమాలు స‌క్సెస్ కావ‌డంతో రాజ్ త‌రుణ్‌ కి వ‌రుస ఆఫ‌ర్స్ చుట్టు ముట్టాయి. విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న సుకుమార్ ప్రొడ‌క్ష‌న్ హౌసు ప్రారంభిస్తూ....రాజ్ త‌రుణ్ తో కుమారి 21ఎఫ్ అనే సినిమా చేస్తున్నాడంటేనే అర్ధ‌మ‌వ్వాలి ఈ కుర్రాడి స్టామినా ఏంటో. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌య‌మవుతున్నాడు.

ఈ చిత్రం షూటింగ్‌ ను పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీట వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకి పాటలు విడుదల చేసి, సినిమాను డిశంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. అలాగే మంచు విష్ణు చిత్రంలో - పెద్ద వంశీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రియు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో క‌మిట‌య్యాడ‌ట రాజ్ త‌రుణ్‌. ప్ర‌తిభ ఉంటే చాలు కచ్చితంగా స‌క్సెస్ అవుతాము అన్న‌దానికి రాజ్ త‌రుణే నిద‌ర్శ‌నం.