Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్-వాటే పబ్లిసిటీ

By:  Tupaki Desk   |   3 Jan 2018 8:23 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్-వాటే పబ్లిసిటీ
X
ఏమైనా నాగార్జున తెలివే తెలివబ్బా. హీరోగా తనలోని నటుడిని ఎప్పటికపుడు మెరుగు పరుచుకుంటూనే నిర్మాతగా కూడా తెలివైన ఎత్తుగడలతో సినిమా మార్కెటింగ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని సక్సెస్ కొడుతూ ఉంటారు. నిన్న సోషల్ మీడియాలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నుంచి ఒక మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పేరు రంగుల రాట్నం. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో చంద్ర మోహన్ - అంజలి దేవి నటించిన అల్ టైం సూపర్ హిట్ మూవీ టైటిల్ ఇది. ఇన్నాళ్ళకు మళ్ళి దీనికి పెట్టారు. అసలు షూటింగ్ ఎప్పుడు జరిగిందో, పాటలు ఎక్కడ తీసారో లాంటి వివరాలు ఏవి ఇప్పటి దాకా మీడియా కు షేర్ చేసుకోకుండా ఏకంగా సినిమాని సంక్రాంతి రేస్ లో నిలబెట్టేసారు. అవును. రంగుల రాట్నం సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

పోస్టర్ థీం చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. జనరల్ గా బైక్ నడిపే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే అందులో హీరోకి టెస్ట్ చేయటం చాలా సినిమాల్లో చూసాం. కాని హీరో వెనుక కూర్చుని హీరొయిన్ బైక్ నడుపుతూ బ్రీత్ అనలైజర్ ను నోట్లో పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా వెరైటీనే. ఇప్పుడిది బాగా వైరల్ అవుతోంది. అసలే యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ లో దొరికిపోవడాన్ని టీవీ మీడియా పండగ చేసుకుంది. ఇది మైండ్ లో ఉన్న జనాలకు ఈ పోస్టర్ భలే కనెక్ట్ అవుతోంది. టైం చూసి మరీ సిచువేషన్ కి సింక్ అయ్యే పోస్టర్ వదిలారా లేక న్యూ ఇయర్ వేడుకల్లో ఇది సాధారణంగా జరుగుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసారో తెలియదు కాని టైమింగ్ మాత్రం భలే సెట్ అయ్యింది. శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చిత్ర శుక్లా హీరొయిన్. పవన్ - సూర్య - బాలకృష్ణ మధ్య ఇప్పటికే సంక్రాంతి పోటీ మహా రంజుగా ఉంటే ఇప్పుడు నాగార్జున అండగా రాజ్ తరుణ్ కూడా తోడయ్యాడు.