Begin typing your search above and press return to search.

కుమారి సీతమ్మకి కీడు చేస్తుందా?

By:  Tupaki Desk   |   8 Dec 2015 7:30 PM GMT
కుమారి సీతమ్మకి కీడు చేస్తుందా?
X
కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తరువాత సినిమా ఏ కధానాయకుడికైనా పెద్ద సవాలే. సూపర్ స్టార్ రజినికాంత్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకూ ఈ విషయంలో పప్పులో లేగ్గేసినవారే. ఈ కాన్సెప్ట్ కి చిన్న హీరోలు సైతం మినహాయింపు కాదు. నాని - శర్వానంద్ - అల్లరి నరేష్ లకు కూడా పెద్ద హిట్ తరువాత పెను ఫ్లాప్ అలుముకుంది.

ప్రస్తుత తరం రైజింగ్ హీరోగా రాజ్ తరుణ్ దూసుకుపోతున్నాడు. ఉయ్యాల జంపాల ఆడిస్తూ సినిమా చూపిస్తూ తరువాత కుమారిని పడేసిన రాజ్ తరుణ్ హ్యాట్ ట్రిక్ విజయాలతో జోష్ మీద వున్నాడు. అయితే మొదటి రెండు విజయాలకంటే రెట్టింపు రెట్లు కుమారి విజయం సాధించడంతో తరుణ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు తన తదుపరి సినిమాను మొదటి రెండు చిత్రాలను చూసిన దృష్టిలో చూడమంటే కష్టమే. ఈ క్రమంలో విడుదలకానున్న సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు సినిమాపై పెద్ద భారమే పడింది.

ఇటీవల విడుదలచేసిన ట్రైలర్ ని చూస్తే ఇది కూడా ఉయ్యాల జంపాల వంటి విలేజ్ నేటివిటీ గల లవ్ స్టోరీ అని అర్ధమవుతుంది. మరి ఈ సీతమ్మకి కుమారి ఏమన్నా కీడు చేస్తుందా లేదా అన్నది చూడాలి