Begin typing your search above and press return to search.

వర్మ సినిమా తర్వాత.. ముందు ఆ మూడు

By:  Tupaki Desk   |   17 Nov 2015 3:30 PM GMT
వర్మ సినిమా తర్వాత.. ముందు ఆ మూడు
X
యువ కథానాయకుల్లో బిజీయెస్ట్ ఎవరంటే నారా రోహిత్ పేరే చెప్పాలి. దాదాపు తొమ్మిది సినిమాలేమో లైన్లో పెట్టాడు నారా వారబ్బాయి. అతడి తర్వాత బిజీయెస్ట్ హీరో రాజ్ తరుణ్ అనే చెప్పాలి. అతడి కోసం నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఐతే ప్రస్తుతానికి మూడు సినిమాలు ఓకే చేశానని.. త్వరలోనే అవి సెట్స్ మీదికి వెళ్తాయని అంటున్నాడు రాజ్.

వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ సీక్వెల్ లో రాజ్ తరుణ్ నటిస్తాడని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నిజమే అని చెప్పాడు రాజ్. వంశీ స్క్రిప్టు పూర్తి చేశారని.. ప్రస్తుతం డైలాగ్స్ రాయిస్తున్నారని.. దీనికి ‘ఫ్యాషన్ డిజైనర్’ అనే టైటిల్.. ‘సన్నాఫ్ లేడీస్ టైలర్’ అనే ట్యాగ్ లైన్ అనుకుంటున్నట్లు చెప్పాడు. మంచు విష్ణుతో కలిసి ఓ పంజాబీ మూవీ రీమేక్‌ లో నటించబోతుండటం కూడా వాస్తవమే అని.. ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ అని అన్నాడు. మారుతి ఇచ్చిన కథతో దిల్ రాజు నిర్మాణంలో ఓ యంగ్ డైరెక్టర్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నానని.. వర్మతో అనుకుంటున్న సినిమా ఇంకా ఓ రూపానికి రాలేదని.. ఈ మూడు సినిమాలు చేశాక, వర్మ కూడా ఫ్రీ అయ్యాక ఆ సినిమా ఉండొచ్చని రాజ్ వెల్లడించాడు.