Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే..

By:  Tupaki Desk   |   20 Aug 2015 11:19 PM GMT
ఆ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే..
X
షార్ట్ ఫిల్మ్ నుండి సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఆన్ లైన్ లో షార్ట్ ఫిల్మ్స్ కున్న హవా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వాటితో యూత్ కి విపరీతంగా చేరువైన ఈ కుర్ర హీరో మొదటి అవకాశంలోనే నిరూపించుకుని, తాజాగా రెండో అవకాశంతోనూ సినిమా చూపించాడు. తొలి సినిమా హీరోయిన్ అవికా గోర్ తోనే రెండో సారి నటించిన సినిమా చూపిస్తా మావా సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. లాజిక్ లేకపోయినా సినిమాటిక్ మేజిక్ తో హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

రెండో సినిమా కూడా హిట్టవ్వడంతో ఫుల్ కుషీలో వున్న ఈ కుర్రాడు తన అభిమాన హీరో అయిన రవితేజ తనను ప్రశంసించడం మరిచిపోలేనిదంటూ ఇదే ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపాడు. అందులో సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మిస్తున్న 21 ఎఫ్ ఒకటి. ఈ సినిమా నిర్మాణంలోనూ సుకుమార్ భాగస్వామ్యం పంచుకున్నారు. ఇక రెండోది శ్రీనివాస్ అనే దర్శకుడితో పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. రెండు సినిమాలూ దాదాపు చిత్రీకరణ పూర్తయ్యాయట. ఈ రెండు ఇదే సంవత్సరాంతంలో విడుదల కానున్నాయని చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. కండ కాస్త తక్కువైనా ఈ కుర్రాడిలో కావాల్సినంత కంటెంట్ వుంది. సరైన దర్శకులు తగిలితే టాప్ హీరోల జాబితాలో చేరిపోయే లక్షణాలన్నీ వున్నాయ్. కాదంటారా..?