Begin typing your search above and press return to search.

నాగార్జున నిర్మాణంలో మ‌ళ్లీ ఆ కుర్ర హీరో

By:  Tupaki Desk   |   20 Nov 2016 3:36 AM GMT
నాగార్జున నిర్మాణంలో మ‌ళ్లీ ఆ కుర్ర హీరో
X
కొత్త టాలెంటును ప్రోత్స‌హించ‌డంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర్నుంచి ఎంద‌రో ద‌ర్శ‌కుల్ని.. టెక్నీషియ‌న్ల‌ను.. న‌టీన‌టుల్ని త‌న బేన‌ర్ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశాడు నాగ్. యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ కూడా నాగ్ బేన‌ర్ ద్వారా ప‌రిచ‌య‌మైన‌వాడే. అత‌డి తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల‌’కు నాగ్ నిర్మాణ భాగ‌స్వామి. ఇప్పుడు హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజ్ త‌రుణ్‌.. మూడు నాలుగు సినిమాల్ని చేతిలో ఉంచుకున్నాడు. వాటి షూటింగ్ లో తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. అత‌డితో నాగార్జున కూడా మ‌ళ్లీ ఓ సినిమా చేయ‌బోతుండ‌టం విశేషం.

అన్నపూర్ణ స్టూడియోస్ బేన‌ర్లో తన రెండో సినిమాకు రాజ్ త‌రుణ్ ఓకే చెప్పాడు. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. డిసెంబర్ 1న ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. మ‌రోవైపు త‌న కొడుకులు నాగ‌చైత‌న్య‌.. అఖిల్ ల‌తోనూ ఇంకొన్ని రోజుల్లో సినిమాలు మొద‌లుపెడుతున్న నాగ్.. నిర్మాత‌గా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. మ‌రోవైపు రాజ్ త‌రుణ్‌.. ‘కిట్టుగాడు’.. ‘రాజ్ గాడు’.. ‘అంధ‌గాడు’ అనే మూడు సినిమాల్లో ఒకేసారి న‌టిస్తుండ‌టం విశేషం. వీటిలో ‘కిట్టుగాడు ముందుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/