Begin typing your search above and press return to search.

పిక్ టాక్ః రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’.. పవర్ మొత్తం లిప్ లాక్ లోనే చూపిస్తున్నాడుగా..

By:  Tupaki Desk   |   14 Feb 2021 11:00 PM IST
పిక్ టాక్ః రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’.. పవర్ మొత్తం లిప్ లాక్ లోనే చూపిస్తున్నాడుగా..
X
షార్ట్ ఫిలింస్ తో వెండితెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధించింది, కెరీర్ ను కంటిన్యూ చేశాడు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల.. జంపాల’తో సాఫ్ట్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్.. ఆ తర్వాత ‘సినిమా చూపిస్తమావ’, కుమారి 21ఎఫ్ వంటి చిత్రాలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఈ క్రమంలో పలు వైఫల్యాలు ఎదురైనప్పటికీ.. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు రాజ్ తరుణ్. విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. దాంతో.. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘పవర్ ప్లే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్‌లో రాజ్ తరుణ్ లిప్ లాక్ తో రెచ్చి పోతున్నాడు. పోస్టర్ తోనే ఇలాంటి కిక్ ఇస్తే.. ఇక, సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు నెటిజ‌న్లు. వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఈ చిత్రాన్ని మార్చి 5న రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. మేక‌ర్స్‌.