Begin typing your search above and press return to search.

ప్రతిసారీ గోదావరే అంటే ఎలా కుర్రోడా?

By:  Tupaki Desk   |   14 Aug 2015 1:30 PM GMT
ప్రతిసారీ గోదావరే అంటే ఎలా కుర్రోడా?
X
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ హీరోలైతే తొలి సినిమా కోసం మూణ్నాలుగేళ్ల ముందు నుంచి సన్నద్ధమవుతారు కాబట్టి ఓకే. కానీ ఇలాంటి బ్యాగ్రౌండేమీ లేకుండా తొలి సినిమాతో తడబాటు లేకుండా నటించి మెప్పించడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో రాజ్ తరుణ్ ప్రతిభ చూసి అంతా ఆశ్చర్యపోయారు. గోదావరి జిల్లా కుర్రాళ్లు అచ్చు పోసుకుని ‘ఉయ్యాల జంపాల’లో దిగిపోయిన రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. అక్కడో నటుడున్నాడన్న సంగతి మరిచిపోయే నిజంగానే ఓ గోదావరి జిల్లా కుర్రోణ్ని చూస్తున్నట్లు భలేగా నటించాడు రాజ్ తరుణ్. రాతలోనూ కొంచెం ప్రవేశం ఉండటంతో అలవోకగా నటించేసి మార్కులు కొట్టేశాడు.

ఇప్పుడు ‘సినిమా చూపిస్త మావ’లోనూ అలాగే చెలరేగిపోయాడు. తొలి సినిమా హిట్టవడంతో వచ్చిన కాన్ఫిడెన్స్ కూడా తోడై కత్తి పాత్రలో కుమ్మేశాడు. కొన్ని సన్నివేశాల్లో రాజ్ తరుణ్ నటన చూస్తే ఈ కాన్ఫిడెన్స్ ఏంట్రా బాబోయ్ అని ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఈజ్ తో నటించాడతను. ఐతే అంతా బాగానే ఉంది కానీ.. ఈ కుర్రాడు తొలి సినిమా యాసనే రెండో సినిమాలోనూ కంటిన్యూ చేశాడు. బేసిగ్గా ఆ ఏరియా నుంచి వచ్చినోడు కాబట్టి, ఆ యాస మీద పట్టుంది కాబట్టి ఓకే. కానీ వేరే యాసలో డైలాగులు చెప్పాల్సి వస్తే ఏంటి పరిస్థితి అన్నదే డౌటు. కుర్రాడి వాలకం చూస్తుంటే ఆ యాస తప్ప మరొకటి చేతకాదేమో.. ఇంకోటి ట్రై చేయడేమో అనిపిస్తోంది. ప్రేక్షకులకు కూడా అలా అలవాటు చేసేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ.. మూడో సినిమాతో కూడా ఇలాంటి యాసే పలికాడంటే మాత్రం మొనాటనీ వచ్చేస్తుందేమో. అదే సమయంలో వేరే యాసలోకి వెళ్తే ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉండే ప్రమాదమూ లేకపోలేదు. మరి ఎలా బ్యాలెన్స్ చేసుకుని కెరీర్ నడిపిస్తాడో చూడాలి.