Begin typing your search above and press return to search.

రవితేజ కాంప్లిమెంట్‌ బూస్టిచ్చింది

By:  Tupaki Desk   |   20 Aug 2015 9:45 AM GMT
రవితేజ కాంప్లిమెంట్‌ బూస్టిచ్చింది
X
ఫ్రీస్టయిల్‌ లో నటించడం అనేది నా స్టయిల్‌. రాజ్‌ తరుణ్‌ ని చూస్తుంటే అంతే ఫ్రీస్టయిల్‌ లో నటిస్తున్నాడనిపించింది. అయితే నన్ను అలా తయారు చేసింది పూరీనే. ఈ క్రెడిట్‌ అంతా పూరీకే చెందాలి అని అన్నాడు మాస్‌ రాజా రవితేజ. కిక్‌ 2 ప్రమోషన్‌ లో సినిమా చూపిస్త మావ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ నటన నచ్చిందని పొగిడేశాడు. అయితే ఇదే విషయంపై రాజ్‌ తరుణ్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. ఇది ఎంతో ఇన్‌ స్పయిరింగ్‌ గా ఉందని మురిసిపోయాడు.

పరిశ్రమ హీరోల నుంచి మొదటి పెద్ద ప్రశంస రవితేజ నుంచే దక్కింది. ముందుగా నటుడు సుబ్బరాజు ఫోన్‌ చేసి బాగా నటించావని ప్రశంసించారు. ఆ తర్వాతి రోజే రవితేజ గారు నా గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడడం ఆనందాన్నిచ్చింది. మొదటి అతి పెద్ద ప్రశంస ఇది. వాస్తవానికి రవితేజ లోని ఎనర్జీ నాకు లేదు. అయితే నేను హీరో అవ్వడానికి ఇన్‌ స్పిరేషన్‌ రవితేజనే. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగారాయన.. అంటూ కుర్రహీరో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అయితే రాజ్‌ తరుణ్‌ ఈ విజయంతో సంతృప్తి పడిపోతే కష్టం. అంత పెద్ద హీరో సూపర్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు కాబట్టి మరింత బాధ్యతగా ప్రవర్తించి ఇలాగా విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం.