Begin typing your search above and press return to search.

కింగ్ నాగ్ లాంచ్ చేసిన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   28 Aug 2021 12:30 PM GMT
కింగ్ నాగ్ లాంచ్ చేసిన రాజ్ తరుణ్ అనుభవించు రాజా ఫస్ట్ లుక్..!
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ''అనుభవించు రాజా'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పల్లెటూరి నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (SVCLLP) సహకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

''అనుభవించు రాజా'' అనే టైటిల్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఇందులో రాజ్ తరుణ్ ఎలాంటి బాధలు బందీలు లేని లక్కీ గై పాత్రలో నటిస్తున్నారని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పందెం రాయుడుగా కనిపిస్తున్న రాజ్ తరుణ్.. మెడలో బంగారపు చైన్లు - చేతికి ఉంగరాలు మరియు బ్రాస్‌ లెట్ ధరించి ఉన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని పందెం కోడిని నెమరుతూ ఉల్లాసంగా కనిపిస్తాడు. జాతరను తలపించే బ్యాగ్రౌండ్ లో దేవాలయం - విభిన్న కళాకారులు - కరెన్సీ నోట్లు - పేకముక్కలు మొదలైనవి కనిపిస్తాయి.

''అనుభవించు రాజా'' ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఇందులో కోడిపందాలు - జూదాలను ఇష్టపడే విలాసవంతమైన యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తుండగా.. గేయ రచయిత భాస్కరభట్ల సాహిత్యం రాస్తున్నారు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అనుభవించు రాజా' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి - ఆడుకాలమ్ నరేన్ - అజయ్ - సుదర్శన్ - టెంపర్ వంశీ - ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు నటిస్తున్నారు. 'ఉయ్యాల జంపాల' 'రంగులరాట్నం' సినిమాల తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజ్ తరుణ్ చేస్తున్న మూడో చిత్రం ఇది. గతేడాది 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ హీరోకి ఈ 'అనుభవించు రాజా' ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.