Begin typing your search above and press return to search.

మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో..

By:  Tupaki Desk   |   14 Nov 2015 1:30 PM GMT
మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో..
X
మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో - తమ్ముడు మనోజ్ తో తప్ప వేరే హీరోలతో కలిసి నటించలేదు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తనీష్ - వరుణ్ సందేశ్ నటించారు కానీ.. వాళ్లవి చిన్న పాత్రలు. వాటిని హీరో స్థాయి క్యారెక్టర్లు అనలేం. ఐతే విష్ణు తొలిసారి బయటి హీరోతో కలిసి ఓ సినిమా చేయబోతుండటం విశేషం. ఆ హీరో మరెవరో కాదు.. రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల - సినిమా చూపిస్త మావ లాంటి హిట్టు సినిమాలతో కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు సంపాదించిన రాజ్.. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’తో మరో మెట్టు ఎక్కుతాడన్న అంచనాలున్నాయి.

రాజ్ ఖాతాలో ఇప్పటికే రెండు మూడు సినిమాలుండగా.. ఇప్పుడు విష్ణు కూడా అతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. విష్ణు చాన్నాళ్ల కిందట ఓ పంజాబీ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అందులో ఇద్దరు హీరోలుంటారు. రెండో హీరో కోసం చాన్నాళ్ల పాటు అన్వేషణ సాగించి.. చివరికి రాజ్ తరుణ్ కే ఓటేశాడు. విష్ణుతో ఇంతకుముందు ‘దేనికైనా రెడీ’ లాంటి హిట్టు ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం అతను సుశాంత్ తో ‘ఆటాడుకుందాం రా’ తీస్తున్నాడు. అది పూర్తయ్యాక విష్ణు - రాజ్ కాంబినేషన్లో సినిమా మొదలుపెడతాడు. ఈ చిత్రాన్ని విష్ణునే నిర్మిస్తాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.