Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ సుకుమార్-రాజ్ త‌రుణ్‌?

By:  Tupaki Desk   |   24 Sep 2016 7:30 PM GMT
మ‌ళ్లీ సుకుమార్-రాజ్ త‌రుణ్‌?
X
గ‌త ఏడాది చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది 'కుమారి 21 ఎఫ్‌'. చిన్న సినిమాల్లో దాన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెప్పొచ్చు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ.. స్క్రీన్ ప్లే అందించ‌డంతో పాటు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌డంతో మంచి క్రేజ్ వ‌చ్చింది. సినిమా కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉండ‌టంతో మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. భారీ వ‌సూళ్ల‌తో పెద్ద సినిమా అయింది 'కుమారి 21ఎఫ్‌'. ఈ సినిమాతో హీరో రాజ్ త‌రుణ్ మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు మ‌రోసారి సుకుమార్ క‌థ‌తో రాజ్ త‌రుణ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఖ‌రార‌వ‌లేదు కానీ.. రాజ్ త‌రుణ్ కోసం సుక్కు ఓ స్క్రిప్టు రెడీ చేశాడ‌ట‌. ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మించ‌ట్లేదు. 14 రీల్స్ సంస్థ‌కు ఈ సినిమా నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నాడు. బ‌హుశా 'కుమారి 21 ఎఫ్' తీసిన సుక్కు శిష్యుడు సూర్య ప్ర‌తాపే ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌వ‌చ్చేమో. వ‌చ్చే నెలలోనే సుకుమార్‌.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సినిమాను మొద‌లుపెట్ట‌బోతున్నాడు. మ‌రోవైపు రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం 'దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కామెడీ సినిమా చేస్తున్నాడు. మారుతి క‌థ‌తో అత‌ను చేయాల్సిన సినిమా ఒక‌టి మొద‌లైన‌ట్లే మొద‌లై ఆగిపోవ‌డంతో దాని కోసం కేటాయించిన డేట్లు వృథా అయిపోతున్నాయి. ఆ డేట్ల‌నే సుకుమార్ సినిమా కోసం కేటాయిస్త‌న్నాడ‌ట‌. వ‌చ్చే నెల‌లోనే ఈ సినిమా కూడా మొద‌లు కావ‌చ్చు.