Begin typing your search above and press return to search.

కుమారి ఆడితే.. కుర్రాడు దొరకడు

By:  Tupaki Desk   |   12 Nov 2015 9:30 AM GMT
కుమారి ఆడితే.. కుర్రాడు దొరకడు
X
ఫీల్డ్ ఏదైనా సరే.. సక్సెస్ వెంటే పరుగులు పెడతారు జనాలు. సినిమా రంగంలో ఈ పరుగులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఒక్క హిట్టు పడిందంటే చాలు.. ఇక్కడ జాతకాలు మారిపోతాయి. అలాంటిది కుర్ర హీరో రాజ్ తరుణ్ ఒకటికి రెండు హిట్లు కొట్టి ఊపుమీదున్నాడు. ఇప్పుడు అతడికి ఇంకో హిట్టు ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

వచ్చే శుక్రవారం విడుదల కాబోయే ‘కుమారి 21 ఎఫ్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్ - ట్రైలర్ - ఆడియో అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్ పెంచాయి. దీంతో రాజ్ తరుణ్ కాబోయే హ్యాట్రిక్ హీరో అని ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో. తొలి సినిమా హిట్టయినప్పటికీ రెండో సినిమాకు పాతిక లక్షలే రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు రాజ్ తరుణ్.

ఐతే అతడి సెకండ్ మూవీ ‘సినిమా చూపిస్త మావ’ కూడా మంచి విజయం సాధించడంతో కుర్రాడి రేంజ్ మారిపోయింది. ఇప్పుడు 50-60 లక్షలు పలుకుతున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాడంటే.. రాజ్ రేంజి కోటికి మారిపోతుంది. అందుకే కొత్త సినిమాలేవీ కమిట్ కాకుండా హోల్డ్ లో పెట్టి.. వెయిట్ చేస్తున్నాడు. వచ్చే వారం ‘కుమారి 21 ఎఫ్’ హిట్టయితే.. కుర్రాడు కోటి క్లబ్బులో చేరిపోవడం ఖాయం.