Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ బయోపిక్..రిలీజ్ డేట్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   5 Jan 2018 9:29 AM GMT
సెన్సేషనల్ బయోపిక్..రిలీజ్ డేట్ ఇచ్చేశారు
X
ఈ ఏడాది బాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో సంజయ్ దత్ బయోపిక్ ఒకటి. తనకు ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ జీవిత కథతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘పీకే’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత హిరాని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య రణబీర్ పూర్తిగా సంజయ్ దత్ అవతారంలోకి మారిపోయి కనిపిస్తున్న లుక్.. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది.

హిరాని ఏ సినిమా అయినా చాలా నెమ్మదిగా తీస్తాడు. ఏ విషయంలోనూ రాజీ పడడు. సంజయ్ దత్ బయోపిక్ మొదలై కూడా దాదాపు ఏడాది కావస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 30కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ అందుకోలేకపోతున్నాడు హిరాని. తాజాగా ఆయన దత్ బయోపిక్ కు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చాడు. జూన్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు. ‘సంజయ్ దత్’ అనే పేరే ఖరారు చేయొచ్చని సమాచారం.

ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటిస్తుండగా.. దత్ తల్లి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాలా కనిపించనుంది. దత్ భార్య మాన్యత క్యారెక్టర్లో దియా మీర్జా నటిస్తోంది. ఇంకా సో్నమ్ కపూర్.. అనుష్క శర్మ.. విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటిదాకా హిరాని తీసిన సినిమాలన్నీ సామాజిక అంశాల నేపథ్యంలో సాగినవే. అవి జనాలకు ఒక పాఠాల్లా ఉండేవి. మరి కేసుల్లో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లొచ్చిన దత్ జీవితాన్ని హిరాని ఎలా చూపిస్తాడు.. ఈ సినిమా ద్వారా ఏం చెబుతాడు అన్నది ఆసక్తికరం.